పొలిటికల్‌ ఫ్రెండ్‌ షిప్‌. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్‌ చేసిన వారిలో వీరు ప్రముఖంగా కనిపిస్తున్నారు. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా! అన్న సినీ కవి వ్యాఖ్యలు ఈ సమాజాన్ని నేటికీ నడిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. సుఖాన్ని, సంతోషాన్నే కాదు, కష్టాన్ని, నష్టాన్ని కూడా పంచుకు నేదే నిజమైన స్నేహం. అన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో స్నేహాన్ని గురించి మాట్లాడుకుంటే.. బాపు-రమణల బంధా న్ని పక్కనపెట్టి మాట్లాడలేం. 


సరేవారు సినిమా రంగానికి పరిమితమైననేపథ్యంలో పొలిటికల్‌గా ఈ తరహా స్నేహితులు ఎవరైనా ఉన్నారా? అంటే.. గడిచిన ఆరేళ్లుగా స్నేహంగా ఉన్న కేసీఆర్‌-జగన్‌ల బంధం మనకు తెరమీదికి వస్తుంది. ఎన్నికలకుముందు, తర్వాత కూడా కేసీఆర్‌-జగన్‌లు ఎంతో స్నేహంగా ముందుకు నడుస్తూ.. లక్ష్యాలను అధిగమిస్తున్నారు. ఇక, ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయన కు ఎవరైనా పొలిటికల్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారా? అంటే.. తీవ్రంగానే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. 


నిజానికి పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకునేందుకు నిరంతరం కష్టించిన చంద్రబాబుకు పెద్దగా స్నేహితులు లేరనే చెప్పాలి. ఆయనతో కలిసి నలభై ఏళ్లపాటు రాజకీయ ప్రయాణం చేసిన వారు ఎందరో ఉన్నారు. అయితే, ఆయనకు వారికి మధ్య చాలా గ్యాప్‌ ఉంది. ఉదాహరణకు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, కరణం బలరాం వంటి వారు పార్టీలో చాలా సీనియర్లు. 


అయితే, వీరితో చంద్రబాబు ప్రయాణానికి కూడా అంతే సీనియార్టీ ఉంది. కానీ, వీరి మధ్య బాస్‌-సర్వెంట్‌ సంబంధమే తప్ప అంతకు మించిన బంధం పెద్దగాలేదు. పోనీ, ఇతర రాష్ట్రాల సీఎంలతో చంద్రబాబు గత ఏడాది చేతులు కలిపారు. పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ సీఎంలతో కలిసి ముందుకు సాగారు. అయితే, వీరిలో ఏ ఒక్కరితోనూ పాలిటిక్స్‌ను మించిన బంధం మాత్రం పెనవేసుకోలేక పోయారు. 


ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏపీలో ఘోరంగా ఓటమిని చవి చూసినప్పుడు కూడా తన బాధను పంచుకునే మనసెరిగిన స్నేహితుడిని లేకుండా పోయారని బాబుపై వ్యాఖ్యలు వినిపించాయి. ఎంత సేపూ.. పని-పని-పని అంటూ తిరిగారే తప్ప.. తనకంటూ..ఓ స్నేహితుడిని సంపాయించుకోలేక పోవడం పెద్ద వెలితిగానే ఉందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: