కేంద్రం తో పేచీ పెట్టుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సై అంటున్నారా ? అంటే రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు . కేంద్రం వద్దు ... అన్న పని తాను చేస్తానంటూ జగన్  తెగేసి చెబుతుండడం తో , ఇక కేంద్రానికి , ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కు మధ్య ఘర్షనాత్మక వైఖరి తప్పక పోవచ్చునని విశ్లేషిస్తున్నారు . ఇప్పటికే విద్యుత్ ఒప్పందాలను సమీక్షించవద్దని కేంద్రం చెప్పిన జగన్ పట్టించుకోలేదు .  ఖచ్చితంగా సమీక్షించి తీరుతామని చెప్పారు .


విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని భావిస్తోన్న ముఖ్యమంత్రి , ఒప్పందాన్ని  సమీక్షించి తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భావిస్తున్నారు . ఇక తాజాగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న  జగన్ రెడ్డి , రివర్స్ టెండర్ల కు వెళ్లాలని నిర్ణయించింది . పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండర్ల కు వెళ్లడం కరెక్టు కాదని , దీని ద్వారా ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరుగుతుందని కేంద్రం చెబుతోంది .


 కేంద్రం చెబుతోన్న మాటను జగన్ మాత్రం ఖాతరు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కన్పించడం లేదు . పోలవరం పనుల్లో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడించని వైకాపా నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు . ప్రాజెక్టు పనుల్లో అవినీతి ని నిగ్గు తేల్చడం ద్వారా తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఇరుకున పెట్టవచ్చునని భావిస్తోన్న వైకాపా , కేంద్రం ఎంత చెప్పిన వినకుండా రివర్స్ టెండర్ కు వెళ్ళడానికి రెడీ అంటోంది . దీనితో జగన్ వైఖరి పై కేంద్ర పెద్దలు తీవ్ర ఆగ్రహం తో ఉన్నట్లు తెలుస్తోంది .  


మరింత సమాచారం తెలుసుకోండి: