ఇప్పుడు దేశంలో జమ్మూ కాశ్మీర్ వ్యవహారం హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎప్పుడు లేని విధంగా కాశ్మీర్ లోకి భారీగా మిలిటరీ బలగాలను మోహరించడం వెనుక ఏం జరుగుతుందని ఇప్పటికే దేశం మొత్తం మీద తీవ్రంగా చర్చ జరుగుతుంది. మోడీ .. కాశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుబోతున్నాడని ఊహాగానాలు మొదలయ్యాయి. 2014 లో అఖండ మెజారిటీని సాధించిన మోడీ మళ్ళీ 2019 లో తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యి తన సత్తా ఏంటో చూపించారు. అయితే తిరిగి ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించడంతో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవటానికి వెనకడుగు వేయటం లేదు. 


అయితే ఇప్పుడు కాశ్మీర్ లో భద్రత బలగాలను ఎక్కువగా మోహరించడం చూస్తుంటే పాకిస్థాన్ ఆక్రమించిన కాశ్మీర్ ను తిరిగి చేజిక్కించుకోవాలని మోడీ వ్యూహ రచన చేసినట్లు తెలుస్తుంది. కాశ్మీర్ లో మూడో వంతు భూభాగాన్ని 70 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఆక్రమించుకుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పాకిస్థాన్ ఒంటరి అయిపోవటమంతో .. ప్రపంచ దేశాల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగటంతో ఇదే మంచి తరుణమని మోడీ భావిస్తున్నారు. ఇదే గాని జరిగితే పాకిస్థాన్ — భారత్ మధ్య పెద్ద యుద్ధం తప్పదని చెప్పాలి. అయితే ఈ విషయాన్ని కొంత మంది మోడీ వ్యాఖ్యలతో ముడి పెడుతున్నారు.


భారత్ .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను చేజిక్కించుకోవలనే ముందుగానే అమెరికాకు చెప్పిందని .. అందుకే ట్రంప్ నేను మద్య వర్తితత్వం చేస్తానని చెప్పాడని  కొంత మంది ఊహాగానాలు చేస్తున్నారు. అయితే రేపు ఉదయం 9.30 నిముషాలకు కేంద్ర క్యాబినెట్ కాశ్మీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకొనబోతున్నారని తెలుస్తుంది. ఇంకొక పక్క ఇప్పటికే కాశ్మీర్ రాజకీయ పార్టీలు మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక అధికారాలను రద్దు చేస్తే విధ్వంసమేనని చెప్పారు. అయితే రేపు కేంద్రం జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏ నిర్ణయం తీసుకొనబోతుందని దేశం మొత్తం ఒకటే ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: