నమో వెంకటేశాయ

 మహదానందం పొందగలిగే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి గా కొలువైన తిరుమల పరమపావనమైన అత్యంత ముక్తి దాయకమైన పుణ్యక్షేత్రం.

 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సకల పాపహరణం ఎంత సేపు చూసినా తనివి తీరని, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే స్వామివారి దివ్యమంగళ స్వరూపం,  ఆ దర్శన భాగ్యం తో కలిగే ఆనందం దివ్యానుభూతి వర్ణించలేనివి.

 మనకు  ఈరోజు లభించే  స్వామివారి దర్శనం కేవలం అయ్యింది. భక్తుల రద్దీ పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ భక్తులలో ఒక వర్గాన్ని సామాన్య భక్తులు  గా మరొక వర్గాన్ని అనన్య సామాన్యు లు (విఐపి) గా గా విభజించి, సామాన్య భక్తులకు సుదూరంగా రెప్పపాటు దర్శనం, వీఐపీ లుగా పిలవబడే అనన్య సామాన్య భక్తులకు తనివి తీర  దర్శనం చేయించడం అనే పక్షపాత వైఖరి దేవస్థానం వారు చూపించటం శోచనీయం. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీశ్రీనివాసుని పేరు చెప్పుకొని బ్రతుకుతూ తిరుమలలో వెంకటేశ్వరస్వామి కన్నా  గొప్పవారు ఎవరూ లేరన్న చిన్న విషయాన్ని మరిచిపోయి భక్తుల బలహీనతను ఆసరాగా చేసుకుని భక్తులను మోసగించటం వారికే చెల్లింది. సిఫార్సు లేఖలతో తప్పా వేరే ఏ విధంగానూ లభ్యంకాని దర్శనాలు ప్రవేశపెట్టి భక్తులను దేవస్థానం వారు బాధ పెడుతున్నారా అనడంలో సందేహం లేదు.  గుడిలోకి ప్రవేశించిన తర్వాత దేవస్థానం సిబ్బంది వ్యవహార శైలి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఎదురుగా వారు చేసే అకృత్యం మాటల్లో చెప్పలేనిది.

 మహిళలు చిన్నపిల్లలు అన్నా కనీస మర్యాద కనికరం కూడా గుడి నుంచి బయటికి గెంటి వేస్తారు అదేమని ప్రశ్నించినందుకు ఇక్కడ మేము మిమ్ములను గెంటివేయడం ఉన్నాము ఇది మా డ్యూటీ అని నిర్లక్ష్యంగా కలియుగ వైకుంఠంలో ఆ శ్రీనివాసుని ముందే దుర్భాషలాడుతూ వేలు చూపిస్తూ భయభ్రాంతులకు వారి  రాక్షస నైజానికి పరాకాష్ఠ.

 ఈ విధానానికి చరమగీతం పాడాలని  భక్తులందర కు ఒకే విధంగా స్వామి వారి దర్శన భాగ్యం కలగాలని.   భక్తులందరూ ఒకే విధంగా స్వామివారి దర్శనం తో పులకించాలని, పునీతులు అవ్వాలని,  ఆ ఏడుకొండల స్వామి దీవెనలు అందరికీ అందాలని భక్తులందరి చిన్న కోరిక.



మరింత సమాచారం తెలుసుకోండి: