సుజనా చౌదరి. కేంద్రంలో మాజీ మంత్రి గా వ్యవహరించిన టీడీపీ మాజీ నేత. రాజకీయాల్లో అవసరాలు, అవకాశాల కోసం నేతలు ఎంత వెంపర్లాడతారో.. సుజనాను చూస్తే అర్థమవుతుంది అంటారు టిడిపి నాయకులు. చంద్రబాబు పిలిచి ఆయనకు పదవి కట్టబెట్టారు. అనేక ఒత్తిడులు, సీనియర్ల పోటీ కూడా ఉన్నప్పటికీ.. బాబు వెనకాముందు కూడా చూసుకోకుండా సృజనకు రెండోసారి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేశారు. అలాంటి నాయకుడు కేసుల ఒత్తిడిలో టిడిపికి రాం రాం చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. 


అయితే, ఆయన ఇప్పుడు ఏపీలోని జగన్ ప్రభుత్వంపై నీతులు వల్లిస్తున్నారని అంటున్నారు. వైసీపీ నేతలు ప్రస్తుతం ఆయన బిజెపిలో ఉండి, కేంద్ర మంత్రి పదవి కోసం వీరలెవెల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ నేతల మనసును దోచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్ర ప్రజలకు జీవనాడైన‌ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో కనీసం సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా రద్దుచేయడం ముమ్మాటికీ తప్పే నని ఆయన వక్కాణించారు.


పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్రమే నిధులిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ‌నిధి పర్యవేక్షణ బాధ్యత మాత్రమే. ఒకవేళ నిర్మాణంలో ఏవైనా అవకతవకలు, తప్పులు జరిగితే వాటిపై విచారణ జరుపుతూనే.. పనులు ఆపకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలి. విచారణకు కాగ్, ఇతరత్రా ఆడిట్ సంస్థలు ఉన్నాయి. వాటి పని అవి చేస్తుంటాయి. అయినా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును కక్షతో రద్దు చేసినట్లు కనిపిస్తుంది. ఇది బిజెపి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కాదు. ఎంపీగా నా సొంత అభిప్రాయం అని చెప్పుకొచ్చారు. 


పోలవరం ప్రాజెక్టుపై ఆథారిటీ ఆధారిటీ కేంద్రానిదేనని.. గతంలో నీతి అయోగ్ సిఫారసులు మేరకే నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించిందని చెప్పారు. నిజానికి ఇదే సూచనా.. టిడిపిలో ఉండగా.. రాష్ట్ర అభివృద్ధి కోసం బాబే కేంద్రంతో పోరాడి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని చెప్పిన సంగతులు మరిచిపోవడం ఈ సందర్భంగా గమనార్హం. కేంద్రానికి చెందిన ఈ జాతీయ ప్రాజెక్టుకు నిధులన్నీ కేంద్రమే ఇస్తున్నప్పుడు (నిజానికి ఇప్పటికీ రూ.5000 కోట్లకు పైగా ఏపీ ఖ‌ర్చు చేసినా ఒక్క రూపాయి కూడా కేంద్రం విధించలేదు) పర్యవేక్షణకు పరిమితం కాకుండా విధాన నిర్ణయాలు తీసుకునే హక్కు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. 


ఇదే నిజమని అనుకుంటే గత చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి, ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని సమీక్షించలేదా? తనకు నచ్చిన, ఓ పత్రిక అధినేతకు సంబంధించిన బంధువులకు కాంట్రాక్టులను నచ్చిన విధంగా ( నామినేషన్) పందేరం చేయలేదా? ఆనాడు ఈ అధికారం చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు? అనే విషయాన్ని కూడా సుజనా స్పష్టం చేసి ఉండాల్సింది. అయితే, ఆ విషయాలను వ్యూహాత్మకంగానే తప్పించిన సుజనా.. కేంద్రం నుంచి పోలవరం ఖర్చు కింద ఏపీకి రావాల్సిన నిధులు అడగడం మానేసి.. అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ కూడా తేల్చి చెప్పిన తర్వాత ఓ కాంట్రాక్టు సంస్థ తప్పించారని వల్లమాలిన బాధ పడడాన్ని ఏపీ ప్రజలు నాయకులు కూడా ఈసడిస్తున్నారు. మరి జగన్‌కు సుద్దులు చెబుతున్న సూజ‌నా.. కేంద్రానికి కూడా నిధుల విషయంలో హిత బోధ చేస్తే బాగుంటుందని అంటున్నారు. మరి ఈ ఎంపీగారు ఆ దిశగా అడుగులు వేస్తారా? అడిగితే.. వచ్చే మంత్రి పదవి పోతుందని భావిస్తున్నారు? చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: