ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ముందు నుంచి సినిమా వాళ్ల స‌పోర్ట్ త‌క్కువే. ఇంద‌కు చాలా కార‌ణాలు ఉన్నాయి. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రావ‌డం.. ఆయ‌న వార‌సులు బాల‌య్య లాంటి వాళ్లు కూడా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండ‌డం, అటు చంద్ర‌బాబు వ‌ర్గం వాళ్లు నిర్మాత‌లుగా ఉండ‌డం, సినిమా వారిలో రెడ్డి వర్గం తక్కువగా ఉండటం వల్లనో వారి మద్దతు జగన్ కు తక్కువే. కాకపోతే మద్దతు ఇచ్చిన సినిమా వాళ్లు మాత్రం కొంచెం గట్టి వాయిస్ ఉన్నవారే. 


ఇలాంటి వారిలో ఈ ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్‌కు గ‌ట్టిగా స‌పోర్ట్ చేశారు. ఇక త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ ఆ కొందరికి జగన్ మంచి పదవులు కట్టబెడుతున్నారు. ఇటీవలే పృథ్విని టీటీడీ టీవీకి ఛైర్మన్ ను చేశారు. అలీకి, జీవిత రాజశేఖర్ లకు కూడా పదవులు దాదాపు ఖరారయ్యాయి. అయితే, తన వాదనతో వైసీపీ కార్యకర్తలకు మంచి పాయింట్లు అందజేసిన వ్యక్తి పోసాని. పోసాని టీడీపీని, చంద్ర‌బాబును, లోకేష్‌ను ఎలా ?  టార్గెట్ చేశాడో మ‌నం చూస్తూనే ఉన్నాం.


ఇక పృథ్వి ఇటీవ‌ల ఇండ‌స్ట్రీ వాళ్ల‌కు జ‌గ‌న్ సీఎం అవ్వ‌డం ఇష్టంలేద‌ని... సినిమా వాళ్ల‌కు జ‌నాలు ఎప్పుడూ ఓట్లేయ‌వ‌ద్ద‌ని కూడా కోరాడు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై త‌ర్వాత పోసాని మాట్లాడుతూ పృథ్వి వ్యాఖ్య‌ల‌ను ఖండించాడు. సురేష్‌బాబు లాంటి వాళ్లు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ తీసుకున్నార‌ని కూడా చెప్పారు. దీనిపై ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టిన పృథ్వి   ‘‘పోసాని కృష్ణమురళి నా సోదరుడి లాంటివాడు. ఒకటి రెండు మాటలు నేను తప్పు అన్నా అవేమీ విబేధాలు తేవు. పోసాని నన్ను ఓ మాటన్నా నాకు పర్వాలేదు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌న పోసానికి కేబినెట్ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే అదేమీ ఆశ్చర్యం కాదు’’ అన్నారు. 


పోసానితో పాటు జ‌గ‌న్‌కు స‌మీప బంధువు అయిన మోహ‌న్‌బాబుకు కూడా జ‌గ‌న్ ఏదో ఒక ప‌ద‌వి ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్నా ఆయ‌న ఖండిస్తున్నారు. ఇక ఇప్పుడు పోసాని పేరు ఏకంగా కేబినెట్ రేసులో వినిపిస్తుండ‌డం విశేషం. గ‌తంలో పోసాని ప్ర‌జారాజ్యం నుంచి చిల‌క‌లూరిపేటలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు పృథ్వి చెప్పిన‌ట్టు పోసానికి మంత్రి ప‌ద‌వి ఇస్తే జ‌గ‌న్ ఆయ‌న్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: