ట్విట్టర్ వేదికపై మాజీ మంత్రి నారా లోకేష్ రెచ్చిపోతున్నారు .. విజయ సాయి రెడ్డికి ధీటుగా ట్వీట్లు చేయడం నేర్చుకున్నారు .. టిడిపి ప్రభుత్వం ఫై చేసిన ప్రతి విమర్శను ట్విట్టర్ తో సమాధానం చెబుతున్నారు .. ఎన్నికల ముందు నుంచి వైసిపి  పోలవరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని గట్టిగా నమ్ముతుంది .. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మొట్ట మొదట టిడిపి ప్రభుత్వం లో జరిగిన అవినీతిని వెలికి తీయాలని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసారు .. అందులో భాగం గానే పోలవరం ప్రాజెక్టు లో నవయుగ ఇంజినీరింగ్ సంస్థ ను కాంట్రాక్టు నుండి బయటకు పంపారు ..అంతే కాదు రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చారు .. 


2600 కోట్లకు పైగా అవినీతి జరిగిందని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ట్వీట్స్ ద్వారాను , పత్రికా ప్రకటన ల ద్వారాను చెప్పడమే కాదు .. పార్లమెంటు లో ఇదే విషయాన్నీ ప్రస్తావించి చంద్రబాబు ప్రభుత్వం లో జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వమని కోరారు .. అయితే పోలవరం లో అవినీతి జరిగినట్టుగా తమకు ఏవిధమైన పిర్యాదులు అందలేదని సిబిఐ విచారణ అవసరం లేదని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు .. 
తాజాగా నవయుగ ను కాంట్రాక్టు నుండి తప్పించడం ఫై లోక్ సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ `` పోలవరం టెండర్లను రద్దు చేయడం బాధాకరం .. మీ తుగ్లక్ చర్యల వాళ్ళ ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది .. ఖర్చు కూడా పెరుగుతుంది `` అని పోలవరం లో అవినీతి జరగలేదని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది .. 


`` తుగ్లక్ గారూ ఉన్నారా .. ఇది విన్నారా .. పోలవరం లో అవినీతి జరిగిందని తలతిక్క లెక్కలు చెప్పారు .. ఇప్పుడు ఏమంటారు .. ప్రతి పైసా కు లెక్క వుంది ..`` అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్ చేయడం కొసమెరుపు ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మరోసారి చెలరేగిపోయారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని, తనదైన శైలిలో విమర్శలు చేశారు. నారా లోకేష్ ను మాలోకం అని సంబోధిస్తూ కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై వైఖరిని తప్పుపడుతూ నారా లోకేష్ ఇటీవలి కాలంలో తరచూ ట్వీట్లు సంధిస్తోన్న విషయం తెలిసిందే. ఆ ట్వీట్లను ట్వీట్లతోనే ఎదుర్కొంటున్నారు విజయసాయి రెడ్డి. ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ట్వీట్లకు ట్వీట్లతోనే బదులిస్తున్నారు. ఆయనతో పాటు జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావునూ వదల్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: