ఐదేళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుగోలుగా రాష్ట్రాన్ని దోచేసుకున్నారు. సహజ వనరులను కూడా వదలకుండా దోపిడి చేశారు. నీరు, మట్టి, ఇసుక, భూగర్భ గనులు ఇలా...దేనీ వదలకుండా వందల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. అలాంటి వారిలో ఒకరైన మాజీ ఎంఎల్ఏ యరపతి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. అదికూడా మామూలుగా కాదు హై కోర్టు ఆదేశాలతోనే.

 

గుంటూరు జిల్లాలో గురజాల ఎంఎల్ఏగా ఉన్న కాలంలో అంటే మొన్నటి చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో దాచేపల్లి మండంలంతో పాటు చుట్టుపక్కలున్న మండలాల్లో సున్నపురాయి గనులను యధేచ్చగా దోచేసుకున్నారు. అధికారికంగా ఎంత మైనింగ్ చేశారన్న విషయాన్ని పక్కనపెడితే అక్రమంగా సుమారు రూ. 450 కోట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలను దోచేసుకున్నట్లు వైసిపి నేతలు ఆరోపించారు.

 

వారి ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు కూడా వందలాది కోట్ల రూపాయల దోపిడి జరిగిందని నిర్ధారించింది. బాధ్యులపై కేసులు పెట్టమని ఆదేశించినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. ఎందుకంటే జిల్లాలోని యంత్రాంగం కూడా దోపిడికి సహాకారం అందించింది. దానికితోడు పోలీసులు ఎంఎల్ఏపై కేసు పెట్టటానికి ఇష్టపడలేదు.

 

వ్యవహారం కోర్టు దాకా వెళ్ళినపుడైనా కాస్త సద్దుమణిగేదాకా ఆగారా అంటే అదీ లేదు. కోర్టు చెప్పినా యరపతినేని తన మైనింగ్ ను ఏమాత్రం ఆపలేదు. పైగా ఫిర్యాదులు చేసిన వాళ్ళపై దౌర్జన్యాలు కూడా పెరిగాయి. ఎంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఉపయోగం కనబడలేదు. అంటే అంతస్ధాయిలో వ్యవస్ధలను మ్యానేజ్ చేసుకున్నారు. కనీసం చంద్రబాబునాయుడు కూడా ఎంఎల్ఏలను కంట్రోల్ చేయలేదు.

 

సరే ప్రభుత్వం మారింది కదా ? అందుకనే ఇపుడు హై కోర్టు ఆదేశాలతో ఎంఎల్ఏపై కేసు నమోదైంది. అంతేకాకుండా ఎంఎల్ఏ దోపిడికి సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవిన్యు, గనులు, పోలీసులు అధికారులపైన కూడా కేసులు నమోదయ్యాయి.  విచారణ పూర్తయితే కానీ అక్రమ తవ్వకాల్లో ఎవరి వాటా ఎంతో తేలదు ?


మరింత సమాచారం తెలుసుకోండి: