ప్రపంచ దేశాలు రాకెట్లను అంతరిక్షంలోకి పంపి అక్కడ ఏం ఉందో కనుగునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వాటన్నిటికి పోటీగా భారత దేశం కూడా రాకెట్లను సిద్ధం చేస్తుంది. 50 సంవత్సరాల క్రితం చందమామ మీదకు రాకెట్ ను పంపిన అమెరికాకు పోటీగా భారత దేశం నుంచి కూడా చంద్రయాన్ 1 ను పంపించి చంద్రుడిపై నీటి ఆనవాళ్ళను కనుగొన్నారు. అనంతరం వివి దేశాలు కూడా చంద్రుడిపైకి రాకెట్లు పంపగా అందులో కొన్ని విఫలమయ్యాయి... తాజాగా మరోసారి 11 సంవత్సరాల తర్వాత మరళ భారత దేశం చంద్రయాన్ 2 ను పంపించింది. ఇప్పుడు అది కక్షలో ఉంది...

అయితే ఇస్రో మరో కార్యక్రమానికి నడుం బిగించింది. సైంటిస్టులు ఎంతో శ్రమించి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంతరిక్షానికి పంపే శాటిలైట్లకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే? అంతరిక్షంలోని శకలాలు, పాడైపోయిన ఇతర శాటిలైట్లు వచ్చి ఢీకొడితే? ఎంతో శ్రమ, ఖర్చు వృథా అయిపోతుంది. అందుకే.. కోట్ల విలువైన ఉపగ్రహాలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ఇండియన్​ స్పేస్​ రీసెర్చ్​ ఆర్గనైజేషన్ (ఇస్రో) నడుం బిగించింది.

బెంగళూరులోని పీన్యా వద్ద ‘స్పేస్​ సిచువేషనల్​అవేర్​నెస్​​ కంట్రోల్​సెంటర్ (ఎస్ఎస్ఏఎం)’ నిర్మాణానికి ఇస్రో చైర్మన్​కె.శివన్​ శుక్రవారం పునాది రాయి వేశారు. అంతరిక్షంలోకి చాలా దేశాలు పంపుతున్న ఉపగ్రహాలు కొన్నేళ్లు పనిచేసి, తర్వాత పాడైపోతున్నాయి. వీటితోపాటు ఇంకా ఎన్నో చిన్నచిన్న శకలాలు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ ఉండటంతో ప్రస్తుతం పనిచేస్తున్న, కొత్తగా పంపే ఉపగ్రహాలను తాకే ప్రమాదం రోజురోజుకూ ఎక్కువవుతోంది. గ్రహశకలాలు, సౌర తుఫాన్ల వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల నుంచి కూడా ముప్పు పొంచి ఉంది.

ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాల నుంచి మన ఉపగ్రహాలను కాపాడుకునేందుకు ఈ కంట్రోల్ ​సెంటర్​ పనిచేస్తుందని ఇస్రో శనివారం వెల్లడించింది. ఈ కంట్రోల్ ​సెంటర్​లో ‘స్పేస్ ​సిచువేషనల్​ అవేర్​నెస్​ అండ్​మేనేజ్​మెంట్ ​డైరెక్టరేట్’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఉపగ్రహాలకు ఎదురుగా వచ్చే శకలాలను కంట్రోల్​ సెంటర్​ సైంటిస్టులు గమనిస్తారని,  పూర్తిస్థాయిలో పని మొదలయ్యాక ఆ శకలాలను తొలగించడంపై పరిశోధన చేస్తామని  ఇస్రో చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: