రాష్ట్రంలో జరిగిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలీస్తామని..దేన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  నీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పోలవరం నిలిపేశామని టీడీపీ అసత్యప్రచారం చేస్తోందన్నారు. అసెంబ్లీలో కూడా పోలవరం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారని చెప్పారు. టీడీపీ హాయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి అనిల్ తెలిపారు.  
తొమ్మిదేళ్లు సీఎం గా ఉన్నప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  అసలు పోలవరం ఊసే ఎత్తలేదన్నారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు పనుల కంటే ప్రచారంపైనే చంద్రబాబు ఎక్కువ శ్రద్ద పెట్టారని దుయ్యబట్టారు. పబ్లిసిటీ పిచ్ఛితో 200 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ మహోన్నత ఉద్దేశంతో పోలవరంకి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.


 గడిచిన ఐదేళ్లలో కూడా చంద్రబాబు పాలనలో పోలవరం పనులు నత్తనడకన సాగాయని చెప్పారు. మూడేళ్లు పాటు పనులు చేపట్టకుండా ఎన్నికల ముందు పోలవరం వద్ద హడావిడి చేసి షో చేసారు విమర్శించారు.  వరద కారణంగా ఇప్పుడు పనులు ప్రారంభించే అవకాశం లేదన్నారు. రీ టెండరింగ్ నిర్వహించి పనులను నవంబర్ నుంచి పారదర్శకంగా జరిగేలా చేస్తామళిమని చెప్పారు. ఏదిఏమైనా కానీ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునాది వేసిన పోలవరాన్ని అయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ప్రారంబిస్తారని చెప్పారు. దైవ నిర్ణయం కాబట్టే టీడీపీ హయాంలో పనులు ముందుకు సాగలేదన్నారు.


సుజనా చౌదరి వ్యవహారం చూస్తే విస్మయం కలుగుతోంది అయన ఇంకా టీడీపీ నేతగానే కొనసాగుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది టీడీపీ హయాం లో జరిగిన అవినీతిపై విచారణ ఆపేయాలని సుజనా చౌదరి చెప్పటం విడ్డురంగా ఉంది . చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జనంకి అరచేతిలో వైకుంఠం చూపించాడని ఆరోపించారు. అవినీతి సొమ్ము మూట గట్టుకొని రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులన్నింటిని సరిదిద్ధి పాలనను గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ కృషిచేస్తున్నారని చెప్పారు. 


ప్రధాని మోడీని సీఎం వైఎస్ జగన్  కలవబోతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు అడుగుతామని చెప్పారు. సెప్టెంబర్ మధ్య నాటికి కొత్త ఏజెన్సీకి పనులు అప్పగిస్తామని అన్నారు. ప్రీ-క్లోజర్ విషయాన్ని పీపీఏకు.. కేంద్రానికి నోట్ పంపామని చెప్పారు. నవయుగకు ఇంకా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏముందన్నారు.నవయుగకు నష్టపరిహరం చెల్లించడం దేనికని నిలదీశారు. డీజిల్, సిమెంట్, స్టీల్ ఖర్చులు ప్రభుత్వమే పెట్టింది
నవయుగ కేవలం లేబర్ కాంట్రాక్ట్ మాత్రమే చేసింది. ప్రస్తుతం బిల్లులన్నీ వెరిఫై చేస్తున్నామని చెప్పారు. 60సీ కింద కాంట్రాక్టు మార్పిడి జరిగిన సందర్భంలో ట్రాన్సట్రాయికి ఇచ్చిన డబ్బులను రికవరీ చేస్తామన్నారు. పోలవరం ఒక్కటే కాదు.. నిబంధనలకు విరుద్దంగా అంచనాలు పెంచి ఖరారు చేసిన ప్రతి ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి అనిల్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: