కాంగ్రెస్ దేశంలో అతి ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉన్న పార్టీ.ఇప్పుడు ఆ పార్టీ ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాల వల్ల పూర్తిగా ఉనికిని కోల్పోవాల్సి వస్తుంది.అయినప్పటికీ వారు తమ పద్ధతిని మార్చుకోకుండా మొండిగా వ్యవహరిస్తూ పార్టీ పతనానికి ఎవరు వంతు కృషి వారు అందిస్తున్నారు.

గతంలో నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రగులుతున్న రావణకాష్టం గా తయారైన కాశ్మీరు సమస్యకు ఇన్నాళ్లకు ఒక పరిష్కారం దొరికితే దానికి మద్దతు ఇవ్వకుండా ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తూ మైనారిటీలకు అండగా ఉంటాం అని మళ్ళీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది.

కాశ్మీరు పరిష్కారం  సమయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం ఆ పార్టీ మూలాలను ప్రమాదంలో కి నెట్టేస్తుంది అనడంలో సందేహం లేదనిపిస్తుందికాశ్మీరు విషయంలో అక్కడ పార్టీ లాగా కాంగ్రెస్ వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ఎంత మాత్రం సరైంది కాదని ఇలా చేయడం వల్ల ఆ పార్టీ ఉనికిని కోల్పోతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఈసారి ప్రజలు మారి వారి విధానాలను వారి రాజకీయ సిద్ధాంతాలను తప్పుపట్టి వారికి లోకసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు.

అయిన కాంగ్రెస్ వారు లోపాలను సరిద్దిదుకోకుండా వాటినే పట్టుకొని వేలాడుతుంది. దీని వల్ల ప్రజలలో కాంగ్రెస్ తమ పై ఉన్న విశ్వాసాన్ని మరింత కోల్పోతుంది.

సుదీర్ఘ కాలం పాటు భారత్ దేశాన్ని పరిపాలించిన ఈ పార్టీ ఇప్పుడు నాయకుల మూర్ఖత్వం వల్ల వారు అనుసరిస్తున్న వ్యూహల వల్లే సారథ్యం వహించడానికి ఎవరూ లేని పార్టీగా మారింది.

మరి ఇకనైనా ఆ పార్టీ తమ  వైఖరిని మార్చుకుని జాతీయ స్థాయిలో బీజేపీకి గట్టి పోటీని ఇచ్చే పార్టీగా మారుతుందా,ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ గెలుచుకుంటుందా అనే ప్రశ్నలకు సమాధానం కోసం కొద్దికాలం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: