ఎప్పటి నుంచి దేశ చరిత్రలో వివాదాస్పదంగా తెరపైకి వచ్చిన ఆర్టికల్ 370 కీ ఈ రోజు సంచలన మోక్షం లభించింది.  ఈ అంశంపై పార్లమెంట్ లో రగడ జరిగింది. ఏది ఏమైనా  రాజ్యసభలో నేడు చరిత్రాత్మక బిల్లులతో మోదీ సర్కార్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ రెండుగా విభజన బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో సోమవారం ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

మరో వైపు కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పడుతుంది.  అధికార పార్టీ ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రతిపాదించిన బిల్లుపై రాజ్యసభలో జరిగిన వాడీవేడి చర్చలో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ నేతలు.  రాజ్యాగంలోని ఆర్టికల్ 370 రద్దుతో 35ఏ, బి, నిబంధనలు కూడా రద్దయ్యాయి. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారు... జమ్ముకశ్మీర్‌ భౌగోళికతనే ప్రశ్నార్థకం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఇదిలా ఉంటే  జమ్మూ కశ్మీర్ కొత్త గవర్నర్ గా నరసింహన్ ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను జమ్మూ కశ్మీర్ కు కొత్త గవర్నర్ గా నియమించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం కిరణ్ కుమార్ ఉన్నపుడు గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు నరసింహాన్.  ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఆయన రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉంటూ వస్తున్నారు.  ఈ మద్య ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన విషయం తెలిసిందే.

ప్రస్తుతం నరసింహన్ తెలంగాణ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఇక నరసింహన్ మాజీ IPS గా గతంలో కేంద్ర సర్వీసుల్లో పని చేశారు... హోంశాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నిఘా సంస్థల్లో కూడా నరసింహన్ పని చేశారు. శాంతిభద్రతలు తదితర అంశాలపై నరసింహన్ కు గట్టి పట్టు ఉంది. అందుకే ఆయన అయితేనే అక్కడ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారని కేంద్రం గట్టిగా నమ్ముతుంది.అయితే ఈ అంశంపై కేంద్రం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: