ఆర్టికల్ 370 పై నిర్ణయంతో హైదరాబాద్ లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పాతబస్తీలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఇక నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలు నిఘా పెట్టాయి. ఎప్పుడైతే ఆర్టికల్ 370 మీద కేంద్రం ఒక నిర్ణయం తీసుకుందో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాలన్నిటినీ కూడ కేంద్ర ఇంటెలిజెన్స్ ఐబీ హెచ్చరికల జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ లు కొద్ది సేపటి క్రితమే హై అలర్ట్ ప్రకటించింది.






ఇక్కడ కాశ్మీర్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ కావచ్చు,హైదరాబాద్  కమిషనర్ కావచ్చు రాచకొండ కమిషనరేట్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదు అని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటన జరిగింది. అయితే అన్ని ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైన సరె అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు కనుక మీ దృష్టికి వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని చెప్పడమే కాకుండా ఎక్కడికక్కడ భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలున్నాయో, అతి సున్నితమైన ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాలని గుర్తించి అక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించి ఆ ప్రాంతాలకు భారీ ఎత్తున బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది.




సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కూడా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ కు సంబంధించి 144 సెక్షన్ అమల్లోకొచ్చింది. దీంట్లో ప్రధానంగా కమిషనరేట్ లు చెప్తున్న ప్రకారం మళ్లీ 144 సెక్షన్ విరమిస్తున్నట్లు చెప్పే వరకు కూడా ఇదే కొనసాగుతుంది అన్న విషయాన్ని ఉన్నతాధికారులు చెప్తున్నారు. దానికి టైమ్ వార్నింగ్ పెట్టలేదు. కాకపోతే 144 సెక్షన్ కొనసాగుతుందన్న విషయాన్ని మాత్రం ఒక ప్రకటన రూపంలో వెల్లడించారు. ఈ ఉదృతలు చల్లారే వరకు ఈ చట్టం కొనసాగుతుందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: