ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. మనిషి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఆయన పుట్టిన నేలను మరచిపోకూడదు. ఎటువంటి వంశం నెహ్రుది ఆయన తండ్రి, తాతలంతా ఎంత గొప్పవారు, నెహ్రు  దేశ తొలి ప్రధాని. ఆయన ఎదురులేకుండా పదిహేడేళ్ళ పాటు పాలన చేశారు. ఆయన ఆ  టైంలో ఏం చేసినా అడిగేది కూడా లేదు. అన్ని అవకాశాలు చేతిలో ఉంచుకుని కూడా అయన చేసిందేంటి.


తామ కుటుంబం మూలాలు ఉన్న కాశ్మీర్ ని భారత్ లో  కలవనీయని విధంగా ఆర్టికల్ 370 చేర్చారు. కాశ్మీర్ పండిట్ల వంశంలో పుట్టిన నెహ్రు అదే కాశ్మీర్ అస్తిత్వాన్ని  దెబ్బతీసేలా పాక్ వ్యవహరిస్తూంటే, అక్కడ స్వయం ప్రతిపత్తి కోరిన కొన్ని కుటుంబాలు ఉగ్ర మూకలకు వూతమిస్తూంటే ఏమీ చేయలేకపోయారు. కొన్ని వందల వేల కాశ్మీర్ కుటుంబాలు తమ ఆస్తులని వదులుకుని కాందిశీకుల్లా ఢిల్లీ నడిరోడ్లపై పడిఉంటే సాటి కాశ్మీర్ పండిట్ గా అయన ఉన్నతమైన పదవిలో ఉండి న్యాయం చేయలేకపోయారు.


బలవంతంగా వారిని కాశ్మీర్  నుంచి వెళ్ళగొట్టి, అక్కడి వారి కుటుంబాలను చిత్ర హింసలు పెట్టి ఆడవారి మీద అక్రుత్యాలు చేస్తుంటే దేశాన్ని దాదాపు 50 ఏళ్ళకు పైగా ఏలిన ఒకే కూడా కాశ్మీర్ పండిట్ కుటుంబం కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల మూలంగా ఏమీ చేయలేకపోయింది. నెహ్రూ పదిహేడేళ్ళు,  ఇందిరాగాంధీ పదహారేళ్ళు, రాజీవ్ గాంధి అయిదేళ్ళు పాలించారు. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కనుసన్నల‌లో పదేళ్ల పాటు యూపీయే సర్కార్ సాగింది. ఇలా నెహ్రు కుటుంబం అధికారంలో ఉన్నపుడు ఎపుడైనా కాశ్మీర్ పండిట్ల గురించి ఆలోచన చేయగలిగారా అంటే లేదు అన్న సమాధానమే వస్తుంది.


ఇపుడు దాన్ని సరి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. నెహ్రు చేసిన తప్పును దిద్ది చరిత్రను తిరగరాశారు. ఇక కాశ్మీర్ పండిట్లు అనాధల్లా ఢిల్లీలో పడి ఉండనక్కరలేదు. వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళి కాశ్మీర్లో అందరి మాదిరిగానే జీవిచవచ్చు. అంతే కాదు. తమ పుట్టిన గడ్డకు సేవ చేసుకోవచ్చు. ఇది  ఎవరైనా కోరుకునేదే, దానిని సాకారం చేసిన మోడీ నిజంగా గ్రేట్. మోడీ నెహ్రు సొంత గడ్డకు ఈ విధంగా న్యాయం చేసిన రికార్డ్ తిరగరాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: