జగన్ ది  రాజన్న రాజ్యం కాదు రౌడీ రాజ్యం అని నిత్యం  తెలుగుదేశం పార్టీ నాయకులూ అభిమానులు సోషల్ మీడియాలో  నానా హడావుడి చేస్తున్నాయి.  ఆ మాటకొస్తే ఎన్నికలకు ముందు నుంచీ ఇదే నినాదాన్ని వినిపించారు తెలుగు తమ్ముళ్లు.  వైసీపీ కానీ అధికారంలోకి వస్తే..  అరాచక శక్తులు పెరిగిపోతాయని అధికార అండ చూసి ఎంతకైనా తెగిస్తారని ఇలా  చాలా మాటలే అన్నారు.. ఇప్పటికీ అంటున్నారు. ఆ మాటల ప్రభావమో ఏమో తెలియదు గాని, వైసీపీ నాయకులూ కూడా ఓ రేంజ్ తిట్ల పురాణాలు అందుకుంటున్నారు.  నిజానికి  వైసీపీలోని నాయకులూ కార్యకర్తలు  సమన్వయంతో ఉండాలని.. అది నాయకత్వం నుంచీ స్పష్టమైన ఆదేశాలు ఉన్నా..  ఎలాగూ అధికార అండ ఉందని..  కొంతమంది నేతలు రెచ్చిపోతున్నారు. 


ఇలా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నా. గత నాలుగు రోజులు నుంచీ హైలెట్ అవుతుంది మాత్రం.. కొలుసు పార్ధసారధి, అనిల్ కుమార్ యాదవ్, తాజాగా  స్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ గా బాధ్యతలు చేపట్టిన సినీ నటుడు పృథ్వీ రాజ్. కొలుసు పార్ధసారధి ఓ టీడీపీ నాయకుడి నాలుక కోస్తా.. వాడు ఒట్టి దద్దమ్మ అని రెచ్చిపోయి తిడితే..  పృథ్వీ రాజ్ టీడీపీ అవినీతి మయమని..బాబు అవినీతికి  పక్కా సింబల్ అని.. అమరావతిలో జరిగిన అవినీతి తెలిసాక.. ఆ అవినీతి దెబ్బకి  తాను కరుడుగట్టిన టెర్రరిస్టులా మారిపోతానేమోనని మాటలు అనేశారు. 


అటు నీటి పారుదల శాఖమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ టీడీపీ నాయకుల పై తిట్ల పురాణాలు అందుకుంటున్నారు. స్వతహాగా ఆవేశపరుడైన అనిల్‌కుమార్‌ యాదవ్‌ అసెంబ్లీలోనూ అలాంటి ఆవేశాన్ని ప్రదర్శించడాన్ని మనం ఇప్పటికే చూశాం. వయసులో పెద్ద అని మాజీ  సీఎం అనే ఆలోచన కూడా లేకుండా చంద్రబాబు తరుచుగా నోటికొచ్చినట్లు తిడుతుంటాడు అనిల్. తాజాగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ మళ్లీ విరుచుకుపడుతూ..  'చంద్రబాబు తన అయిదేళ్ల పాలనలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని..అవినీతి సొమ్ము మూటగట్టుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారుని.. చంద్రబాబు అవినీతికి జైల్లో ఉండాల్సిందేనని ఏకవచనంతో బాబును నానా మాటలు అన్నాడు.  

మొత్తానికి 'జగన్'

శిష్యులు నోరు జారుతున్నారు.  అధికారక పార్టీలో ఉన్నప్పుడు అందులోనూ  కీలక పదవుల్లో ఉన్నప్పుడు కూడా  నేతలు ఇలా నోరు జారితే.. అది పార్టీకి తమ నాయకుడికే నష్టం అని ఇకనైనా గుర్తుపెట్టుకుని మాట్లాడాలి.   




మరింత సమాచారం తెలుసుకోండి: