72 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ విషయంలో సమస్యలు సృష్టిస్తూ వస్తున్న ఆర్టికల్ 370 ఆర్టికల్ ను ఈరోజు కేంద్రప్రభుత్వం ఐదు నిమిషాల వ్యవధిలో ప్రవేశపెట్టి రద్దును ఆమోదింపజేసుకుంది.  రద్దుకు రాష్ట్రపతి ఆమోదం పొందటంతో వెంటనే ఇంప్లిమెంట్ అయ్యింది.  ఆర్టికల్ 370 ని రద్దు చేయడమే కాకుండా... జమ్మూ కాశ్మీర్ ను మూడు భాగాలుగా విభజించారు.  రాజ్యసభలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో.. రీ ఆర్గనైజేషన్ బిల్లు ఆమోదం పొందింది.  ఈ బిల్లు ఆమోదం పొందటంతో.. జమ్మూకాశ్మీర్ లో మార్పులు చకచకా జరిగిపోతున్నాయి.  గత నాలుగు రోజులుగా జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు ఈరోజు స్పష్టత రూపం ఇచ్చింది.  



రాష్ట్రంలో చట్టసభలు ఉన్నప్పటికీ పోలీస్ వ్యవస్థ వంటి కీలకమైన అంశాలు గవర్నర్ పరిధిలో ఉంటాయి.  దీంతో అధికారం కేంద్రం పరిధిలోకి వస్తుంది.  సమస్యలపై దృష్టి పెట్టె అవకాశం ఉంటుంది.  రాజకీయాలు చేయాలి అనుకున్నా.. దానికి అవకాశం ఉండదు.  కాశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారం ఇచ్చారు.  ఇక మిగిలింది అక్కడ శాంతిని ఏర్పాటు చేయడమే.  ఇదిలా ఉంటె కేంద్రం మదిలో ఇంకో ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది.  సౌత్ లో బీజేపీ పాగా వేయాలని చూస్తున్నది.  ఎక్కడ పార్టీ బలంగా ఉన్నదో అక్కడి నుంచే మొదలు పెట్టాలని చూస్తున్నది.  



తెలంగాణాలో కాస్తోకూస్తో పార్టీ బలంగా ఉన్నది.  ఇటీవలే తెలంగాణాలో 4 సీట్లు గెలుచుకుంది బీజేపీ.  ఇదిలా ఉంటె, దేశంలో రెండో రాజధానిగా హైదరాబాద్ ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.  కొన్ని రాజకీయ పార్టీలు గతంలో ఈ డిమాండ్ చేశారు కూడా.  హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే.. సౌత్ కూడా అభివృద్ధి చెందుతుందని గతంలో కొంతమంది నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోయాక.. తెలంగాణా రాజధానికి హైదరాబాద్ ఉన్నది.  ఒకవేళ కేంద్రం మదిలో రెండో ఆలోచన ఉంటె.. అది హైదరాబాద్ అయితే.. హైదరాబాద్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. 

ఢిల్లీ లాగా హైదరాబాద్ ను కూడా ఒక రాష్ట్రంగా మార్చి దానికి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి .. రెండో రాజధానిని ఏర్పాటు చెయ్యొచ్చు.  ఇలా చేస్తే తెలంగాణా భారీగా నష్టపోవాల్సి వస్తుంది.  తెలంగాణకు ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది.  ఒకవేళ కేంద్రం మదిలో ఇలాంటి ఆలోచన ఉంటె.. తెలంగాణ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది.. పార్టీలు కేంద్రాన్ని ఎలా ఎదుర్కొంటాయి.. ? ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది..? అసలు కేంద్రం అలాంటి ఆలోచనలు చేస్తుందా..? ఏమో చెప్పలేం.  దేశంలో ఎక్కడ ఏ చిన్న ఉగ్ర అలజడి జరిగినా దాని మూలాలు హైద్రాబాద్లోని ఉంటున్నాయని గతంలో కొందరు బహిరంగంగా విమర్శలు చేశారు.  ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.   


మరింత సమాచారం తెలుసుకోండి: