భారత్ పార్లమెంట్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న 370 అధికరణ రద్దు విషయం పై సానుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తో కాశ్మీర్ సమస్య పరిష్కారం అవ్వడంతో పాటు దేశానికి మేలు జరుగుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు ధోని అభిమానులు 370 రద్దుకు  ధోని నే కారణం అని పోస్టులతో హల్ చల్ చేస్తున్నారు.

ధోనీకి క్రికెట్లో మంచి ఫినిషర్ గా పేరు ఉంది.అతడు ప్రస్తుతం గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో భారత పారామిలటరీ విభాగంలో  కాశ్మీర్ కు వెళ్ళాడు.అతడు ఆపదలో ఉన్న భారత్ క్రికెట్ జట్టును ఎన్నోసార్లు ఆదుకున్నాడు.ధోని చాలా మ్యాచ్ చివరిలో తనదైన శైలిలో సిక్స్ ల వర్షం కురిపించి టీమ్ కు విజయాలను అందించాడు.ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం ధోని కూడా అక్కడే ఉండడంతో కొందరు క్రికెట్ అభిమానులు క్రికెట్ లోనే కాదు ధోని దేశ సమస్యలు ఉన్న సున్నిత ప్రాంతాలలో కూడా చేరిన కొద్దిరోజుల్లోనే మంచి ఫినిషింగ్ ఇచ్చాడు అని పోస్టులు పెడుతూ వాటిని వైరల్ చేస్తున్నారు.

ఈరోజు ఉభయ సభలలో ఈ బిల్లు ను అధికార బిజెపి ప్రవేశపెట్టడంతో దానికి అనుకూలంగా ఓటు వేసిన వారు ప్రజల ప్రశంసలు పొందుతున్నారు.అలాగే ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలు దేశ ప్రజల దృష్టిలో తమ విశ్వాసాన్ని కోల్పోయాయని బీజేపీ ప్రతినిధులు  ఆరోపిస్తున్నారు.

ఎట్టకేలకు ఏడు దశాబ్దాలు సమస్య ఇప్పటికీ పరిష్కారం వైపు అడుగులు వేయడం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేస్తుంది.ఓటు బ్యాంక్ రాజకీయాలకు చెక్ పెడుతూ బీజేపీ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడంతో దేశ ప్రజల నుండి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు పొందుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: