ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీకి సోద‌రుడు నాగ‌బాబు దూరం దూరంగా ఉండ‌డం జ‌న‌సేన రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజా ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత ప‌వ‌న్ వ‌రుస‌గా స‌మావేశాలు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ప‌వ‌న్ త‌న సొంత జిల్లా అయిన ప‌శ్చిమ‌గోదావ‌రిలో ప‌ర్య‌టించాడు. ఈ జిల్లాలోని భీమ‌వ‌రం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన ప‌వ‌న్‌, న‌ర‌సాపురం నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసిన ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు ఇద్ద‌రూ ఓడిపోయారు.


ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన ఎలాంటి కమిటీలు లేకుండానే ఎన్నిక‌ల‌కు వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ పార్టీ ఘోర‌మైన ఓట‌మి మూట‌క‌ట్టుకుంది. ఇక ఇప్పుడు ప‌వ‌న్ పొలిట్‌బ్యూరోలు, పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీలు ఏర్పాటు చేశాడు. జిల్లా క‌మిటీలు, మండ‌ల క‌మిటీల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇక రెండు రోజుల ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ భీమ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుల‌తో మీట్ అవ్వ‌డంతో పాటు న‌ర‌సాపురం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశం కూడా నిర్వ‌హించారు.


ఇంత జ‌రుగుతున్నా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు మాత్రం ఎక్క‌డా క‌న‌ప‌డ‌లేదు. ఓడిపోయిన త‌ర్వాత కూడా నాగ‌బాబు ఒక‌టి రెండు సార్లు త‌మ్ముడు త‌ర‌పున వ‌క‌ల్తా పుచ్చుకుని మాట్లాడారు. పైగా ఎన్నిక‌ల‌కు ముందు త‌న పార్టీలో కుటుంబ స‌భ్యుల ప్రమేయం ఉండ‌దంటూనే, సోద‌రుడు నాగ‌బాబుకు ఎంపీ సీటు ఇచ్చారు. దీనిపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌వ‌న్ వెన‌క్కు త‌గ్గ‌లేదు.


మిగిలిన స‌మావేశాల సంగ‌తి ఎలా ? ఉన్నా తాను పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష‌కు కూడా డుమ్మా కొట్ట‌డంతో నాగ‌బాబుకు పార్టీ కార్య‌క‌లాపాల‌పై పెద్ద‌గా కాన్‌సంట్రేష‌న్ లేదంటున్నారు. ఐదేళ్ల పాటు పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటే అప్పుడైనా పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌దానిపై నాగ‌బాబుకు న‌మ్మ‌కం లేదంటున్నారు. అందుకే మ‌ళ్లీ త‌న టీవీ ప్రోగ్రామ్స్‌తో పాటు వ‌రుణ్ ఫ్యూచ‌ర్ విష‌యంలో దృష్టి పెట్టాల‌నుకుంటున్నాడ‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: