జమ్మూకాశ్మీర్ ను కేంద్రం రెండుగా విభజించించిన విషయం అందరికీ తెలిసిందే.ఐతే ఇప్పుడు జమ్మూ కశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి.కాబట్టి కేంద్ర పాలిత ప్రాంతాలు గవర్నర్ ఆధీనంలో ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే.ఒక వైపు దేశమంతా ఆర్టికల్ 370 రద్దుపై సీరియస్ డిష్కషన్ లో సాగుతుంటే, ఇటు కేంద్రం మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ ల విషయంలోనూ, ఒక నిర్ణయానికి వచ్చేసిందంటున్నారు. జమ్మూ కశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్ గా తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను నియమించే ఆలోచనలో మోదీ ప్రభుత్వం ఉందని అంచనా. ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా వచ్చిన లక్ష్మణ్, ఆ తర్వాత ఏపీ తెలంగాణ రాష్ట్రాలకి కూడా గవర్నర్ గా వ్యవహరించారు.



ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్రం ప్రభుత్వం జమ్ము కశ్మీర్ లో శాంతి భద్రతల విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది . ఈ విషయంలో అపార అనుభవమున్న నరసింహన్ వైపు మొగ్గు చూపుతుందని భావిస్తున్నారు. మాజీ ఐపీఎస్ అయిన నరసింహన్ కి శాంతి భద్రతల్ని కాపాడే విషయంలో చాలా అనుభవముంది. అలానే ఉమ్మడి ఏపీ గవర్నర్ గా ఉన్న వేళ విభజన ప్రక్రియను సమస్యల్ని పరిష్కరించే దిశగా చొరవ చూపించారు.




వీటన్నింటిని పరిశీలించిన తర్వాత నరశింహాన్ని జమ్మూకాశ్మీర్ కి లెఫ్టినెంట్ గవర్నర్ గా పంపే ఆలోచనలో ఉన్నారంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు అన్నది ఏమాత్రం విఫల ప్రయోగమం అవకూడదనీ మోదీ సర్కార్ పట్టుదలతో ఉంది. దీన్ని సక్సెస్ ఫుల్ గా హాండిల్ చేయడానికి కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ కీలక పాత్ర పోషించనున్నారు. ఆ క్రమంలో శాంతి భద్రతల పరిరక్షణ అన్నది పెద్ద చాలెంజ్ గా మారుతుంది.అందుకే తొలి లెఫ్టినెంట్ గవర్నర్ గా నరసింహన్ ని ఎంపిక చేయాలని కేంద్రం భావిస్తుందట. దీనిపై అధికారికంగా త్వరలోనే ప్రకటన రానుందని డిల్లీ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే ఈ విషయాన్ని అటు రాష్ట్రపతి భవన్ గానీ ఇటు గవర్నర్ కార్యాలయం గానీ నిర్ధారించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: