కృష్ణా జిల్లా టీడీపీలో పార్టీ జంపింగ్ విషయాలు అలజడులు రేపుతున్నాయి.టిడిపికి మొదట నుంచి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఈ సారి విజయవాడ తూర్పు, గన్నవరం రెండు చోట్ల మాత్రమే గెలిచింది ఆ పార్టీ. ఈ పరిస్థితి నుంచి తేలుకొని ముందుకు వెళ్ళాలని అధినాయకత్వం రెడీ అవుతున్న వేళ ఓడిన నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా సైకిల్ దిగాలని చూస్తున్నారంటూ సాగుతున్న ప్రచారం రాజకీయాలను వేడెక్కిస్తుంది. కృష్ణా జిల్లా రాజకీయాలలో దేవినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా అంతా పట్టుంది దేవినేని నెహ్రూ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ తమ ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ కారణంగానే గుడివాడ బరిలోకి దిగడానికి సై అన్నారు.



నిజానికి వంగవీటి రాధాని టిడిపిలోకి తీసుకోవడంపై అవినాష్ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందంటున్నారు. అయితే వెంటనే స్పందిస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న భావనతో నాడు సైలెంట్ అయిందని అంటున్నారు. అలానే గుడివాడ వెళ్ళటం అవినాష్ కు ఇష్టం లేదని, కానీ అధిష్టానం ఆదేశించడంతో తమ కుటుంబ ఇమేజ్ లను నమ్ముకొని గుడివాడ బరిలో దిగారు అవినాష్. కానీ కొడాలి నాని చేతిలో ఓటమి తప్పలేదు. ఓటమి తర్వాత పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగానే ఉంటున్నాడు అవినాష్. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న అవినాష్ టీడీపీలో ఇక రాజకీయ కస్టమర్ల భావనకు వచ్చేశారంట.




తన అనుచర వర్గంతో కలిసి వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారట. వైసీపీతో జరిగిన చర్చల్లో అవినాష్ కి విజయవాడ తూర్పు నియోజక వర్గం బాధ్యతలు ఇస్తామని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. విజయవాడ తూర్పులో వైసిపి అభ్యర్థి బొప్పన భవ్య ప్రసాద్ కి, యలమంచిలి రవికి మధ్య విబేధాలు ఉండటంతో నియోజక వర్గం బాధ్యతలు అవినాష్ కి అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. అవినాష్ పార్టీ వీడబోతున్నారంటూ ప్రచారాన్ని ఆయన ఖండించక పోవడంతో ఎప్పుడైనా సైకిల్ దిగి పోవచ్చని టిడిపి లోనే గుసగుసులు సాగుతున్నాయట.




విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా కుదిరితే వైసిపి, వీలైతే బిజెపి అన్నట్టు ఉన్నారట. మల్లాది విష్ణు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన నాటి నుంచి బోండా ఉమ టిడిపి కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. దీంతో బోండా ఉమ పార్టీ మారడం ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నానితో ఉమ సన్నిహితంగా ఉంటున్నారు. కేశినేని నాని బిజెపిలకూ పెడతారన్న ప్రచారం ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే జరుగుతుంది. అలానే సుజనా చౌదరి తోనూ బోండా ఉమ టచ్ లో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.



దీంతో వైసీపీకో బీజేపీకో బోండా ఉమ పార్టీ మారడం మాత్రం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ నడుస్తోంది. కృష్ణా జిల్లాలో టీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరైన వల్లభనేని వంశీ తాను పార్టీ మారబోతున్నారన్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అయితే మంత్రి కొడాలి నాని, వంశీ ఆప్త మిత్రులు ఏపీలో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ క్షీణిస్తున్న నేపథ్యంలో వంశీని వైసిపి లోకి తీసుకురావటానికి కొడాలి నాని చొరవ తీసుకుంటున్నారని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: