జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకొని, జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 ను రద్దు చేసింది.  దీన్ని రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ ను రెండు భాగాలుగా విభజించింది. రెండు భాగాల్లో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక చట్టసభలను ఏర్పాటు చేసి.. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.  అటు లడక్ ను కూడా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది కేంద్రం.  జమ్మూ కాశ్మీర్ లో అంతకు ముందు ప్రత్యేక జెండా ఉన్నది.  ఈ జెండా ఎప్పుడు ఎలా వచ్చింది అనే దానిపై చాలా పెద్ద కథ ఉన్నది.  



ఆర్టికల్ 370 రద్దుకాక ముందు వరకు జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ భవనాలపైనా, అధికారిక కార్యక్రమాల్లోనూ.. జాతీయ జెండాతో పాటు జమ్మూ కాశ్మీర్ జెండాను కూడా ఎగరవేసేవారు.  ఎరుపు రంగులో, నాగలి గుర్తు, మూడు తెల్లని గీతలు ఉన్న జెండా అది.  ఎరుపు రంగు శ్రమ శక్తిని, నాగలి రైతుకు గుర్తుగుగా మూడు తెల్లని నిలువు గీతలు మూడు మతాలకు గుర్తులుగా ఉన్నాయి.  అధికారిక కార్యమ్రమాల్లో ఈ జెండాను ఎవరవేసేవారు.  



ఇప్పుడు ఆ అధికారం లేదు.  ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం.. విధిగా జమ్మూ కాశ్మీర్ కూడా ఫాలో కావాల్సిందే.  జెండాను ఎప్పుడు ఎవరు తయారు చేశారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.  జులై 13, 1931లో జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ ఉద్యమం పురుడు పోసుకుంది.  అప్పట్లో జమ్మూ కాశ్మీర్ డోగ్రా రాజుల పరిపాలనలో ఉన్నది.  జులై 13, 1931న సెంట్రల్ జైలు వద్ద జరిగిన కాల్పుల్లో 21 మంది ఉద్యమకారులు మరణించారు.  



ఆరోజు నుంచి ఉద్యమం పురుడుపోసుకుంది. డోగ్రా రాజులకు వ్యతిరేకంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉద్యమం చేసింది.  జులై 11, 1939 న కాశ్మీర్ ప్రత్యేక జెండాను తయారు చేసింది.  అదే విధంగా 1952 జూన్ 7 వ తేదీన జమ్మూ కాశ్మీర్  తమ అధికారిక జెండాగా ఎరుపురంగు జెండాను ప్రకటించింది.  1952లో జరిగిన ఒప్పందం ప్రకారం ఇండియాలో జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా ఉన్నా, ప్రత్యేక జెండాను మాత్రం ఎగురవేస్తూ వచ్చింది.   జాతీయ జెండాకు అవమానం జరిగినా అక్కడి ప్రజలను శిక్షించే అధికారం లేకుండా చేసింది ఆర్టికల్ 370.  ఆర్టికల్ 370 రద్దుతో.. జాతీయ జెండాను ఎవరైనా అవమానిస్తే వారికి కఠిన చర్యలు తప్పవు.  


మరింత సమాచారం తెలుసుకోండి: