జమ్మూ క‌శ్మీర్‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఇచ్చిన 370 ఆర్టిక‌ల్ ర‌ద్దు అయ్యింది. ఎట్ట‌కేల‌కు కొన్ని సంవ‌త్స‌రాలుగా ఉన్న ఈ వివాస్పద ఆర్టిక‌ల్‌ను ర‌ద్దు చేయాల‌ని కొద్ది రోజులుగా డిమాండ్లు వ‌స్తున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఎట్ట‌కేల‌కు తీసుకున్న డేరింగ్ స్టెప్‌తో దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌శ్మీర్ రాష్ట్ర విభ‌జ‌న‌తో ఇప్పుడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కూడా జ‌రుగుతోంది.


ఈ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచేందుకు కొత్త క‌మిష‌న్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అందుకు అనుగుణంగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా విభ‌జించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌మ్మూల‌ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను 114 నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచ‌నున్నారు. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎక్క‌డా లేని సంతోషాన్ని క‌లిగిస్తోంది.


2014లో స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏపీ, తెలంగాణ‌లో రెండు విభ‌జించారు. అప్పుడు విభ‌జ‌న చ‌ట్టంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచాల‌ని కూడా పాయింట్ పెట్టారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఈ విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు ఊరించి ఊరించి అటకెక్కిస్తూనే వ‌చ్చింది. ఇప్పుడు క‌శ్మీర్‌లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం తెర‌మీద‌కు వ‌స్తుండ‌డంతో ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఇక్క‌డ నాయ‌కులు మ‌ళ్లీ క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు.


మొన్నటిదాకా కశ్మీర్ ప్రాంతంలో 46, జమ్మూలో 37 సీట్లు ఉన్నాయి. ల‌డ‌క్‌లో నాలుగు సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ల‌డ‌క్ కేంద్ర పాలిత ప్రాంతం కావ‌డంతో అక్క‌డ నాలుగు అసెంబ్లీ సీట్లు ర‌ద్ద‌వుతాయి. అక్క‌డ ప్ర‌జ‌లు కేవ‌లం లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్ర‌మే ఓటు వేస్తారు. ఇక 2026 వ‌ర‌కు పార్ల‌మెంటు సీట్లు విభ‌జించ‌కుండా రూల్ ఉంది. అయితే క‌శ్మీర్‌ విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పునర్విభజన ఉన్నందున, అందుకు అనుగుణంగా కమిషన్ వేస్తారు. అదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. మ‌రి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు అంశం స్టీరింగ్ కేంద్రం చేతుల్లో ఉంది. మ‌రి కేంద్రం ఏం చేస్తుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: