ఆర్టికల్ 370 రద్దుకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఆర్టికల్ 370  రద్దుపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అయితే ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ప్రక్రియలో తెలుగు వ్యక్తి కీలక పాత్ర పోషించారు.  కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఆర్టికల్ 370 రద్దు బిల్లు రూపకల్పనలో ఎటువంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా  బిల్లును జాగ్రత్తగా తయారు చేసింది డాక్టర్ జి. నారాయణరాజు.

 

కేంద్ర న్యాయశాఖలో న్యాయ వ్యవహారాల శాఖలో సెక్రటరిగా రాజు పనిచేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే ఎటువంటి బిల్లైనా సరే న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత నారాయణ రాజు మీదే ఉంటుంది.  అయితే ఇక్కడ గమినించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రం ప్రవేశపెట్టే కొన్ని బిల్లులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆ బిల్లులు దేశచరిత్రమే మార్చేసేవిగా ఉంటాయి.

 

లోక్ సభలో పాసైన ఆర్టికల్ 370 కూడా దేశ చరిత్రను మలుపు తిప్పేదనటంలో సందేహం లేదు. అలాగే మొన్న త్రిపుల్ తలాక్ బిల్లు రద్దు కూడా అటువంటిదే.  ఆర్టికల్ 370 రద్దు బిల్లును కేంద్రం అత్యం వ్యూహాత్మకంగా లోక్ సభలో ప్రవేశపెట్టింది. బిల్లు ప్రవేశపెట్టేముందే కేంద్రం సదరు బిల్లుపై ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించింది. అందులో కూడా నారాయణ రాజే కీలక పాత్ర పోషించారు.

 

న్యాయ నిపుణులు న్యాయ సలహాలు ఇవ్వగలరే కాన డ్రాఫ్టింగ్ కు వచ్చే సరికి రాజు లాంటి నిపుణులే కీలక పాత్ర పోషిస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. న్యాయ నిపుణులు-నారాయణ రాజు జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసిన తర్వాత బిల్లును అధికార పార్టీ లోక్ సభలో ప్రవేశపెట్టి నెగ్గించుకున్నది. ఇదే బిల్లును అమిత్ షా రాజ్యసభలో కూడా ప్రవేశపెడుతున్నారు. ఆర్టికల్ 370 ని తమిళనాడుకు చెందిన గోపాలస్వామి అయ్యంగార్ తయారు చేస్తే రద్దును నారాయణ రాజు డ్రాఫ్ట్ చేయటం గమనార్హం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: