పవన్ కల్యాణ్ పార్టీ జనసేన మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా పరాజయమైన సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తాం.. కాబోయే ఏపీ సీఎం నేనే అని పవన్ కల్యాణ్ ఎన్నికలప్రచారం సమయంలో క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు చెప్పినా.. అంత సీన్ లేదన్న సంగతి ఆయనకూ అప్పటికే తెలుసు. కాకపోతే.. 20- 30 సీట్లు సంపాదించుకుంటే పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అవుతారాని కూడా అప్పట్లో విశ్లేషకులు అంచనా వేశారు.


చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో నిరాశ చెందిన కాపు సామాజిక వర్గ నేతలంతా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడంతో మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. జనసేన కోసం మొన్నటి ఎన్నికల్లో పని చేశారు. తమ నాయకుడు కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతాడని ఆశించారు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు.


అయితే ఎన్నికల్లో పరాజయంపై పెద్దగా తాను బాధపడలేదంటున్నారు పవన్ కల్యాణ్.. భీమవరంలో తను ఓడిపోయానన్న విషయం తెలిసి పార్టీ కార్యకర్తలు అబిమానులు బాదపడ్డారని గుర్తు చేసుకున్నారు. చాలా మంది కుగిపోయారని, కాని తాను మాత్రం పదినిమిషాలలో తేరుకుని తర్వాతేంటి అనిఆలోచించానని ఆయన అంటున్నారు. ఓటమిని తలచుకుని ఎంతకాలం బాధపడతాం? అని పవన్‌ పేర్కొన్నారు. తన ఆఖరి శ్వాస వరకూ పార్టీని నడుపుతానంటున్నారు.


ఇదే సమయంలో తన అన్న పెట్టిన ప్రజారాజ్యం పరాజయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోదరుడు చిరంజీవి మెతకతనం, ఒత్తిడితోనే ఆయన ప్రజారాజ్యం పార్టీని నడపలేకపోయారని కామెంట్ చేశారు. తాను జనసేన పరాజయం తర్వాత కూడా నేతలందర్నీ కూర్చోబెట్టి మాట్లాడినట్టు ఆ రోజు చిరంజీవి చేసి ఉంటే... ఈరోజు పీఆర్పీ బతికే ఉండేదని కామెంట్ చేశారు. మరి చిరంజీవిపై పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలను మెగాస్టార్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: