తెలుగులో అతి తక్కువ కాలంలోనే మంచి ఛానెల్ గా పేరు తెచ్చుకున్న మోజోటీవీ ఇప్పుడు మూత పడే దిశగా సాగుతుంది. అయితే చాలా రోజుల్నించి ఈ గొడవ జరుగుతున్నది. రవి ప్రకాష్ ద్వారా మోజో టీవీలొకి అక్రమంగా నిధులు వచ్చాయని, దానికి సీఈవో గా పనిచేసిన రేవతి కారణం అని ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఆమె స్థానంలో కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. అయితే ఈ కొత్త యాజమాన్యం మోజో టీని మూసివేసి, ఎక్విప్ మెంట్ ను అమ్మేయాలని చూస్తుంది.


దీనిలో భాగంగా ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు. ఒక నెల జీతం తీసుకుని రాజీనామాలు చేసి వెళ్లిపోండని వాళ్ళకి చెప్పారు. అయితే ఒక కంపెనీని సడెన్ గా క్లోజ్ చేసినపుడు మూడు నెలల జీతం ఇవ్వాలనేది నియమం. కానీ మోజో టీవీ దీనికి ఒప్పుకోవట్లేదు. దీంతో ఉద్యోగులు మోజో టీవీ ఎదుట ధర్నా చేయడం మొదలు పెట్టారు.వాళ్ళు చేస్తున్న ధర్నాకి మద్దతు కావాలని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి ఆయన ఓకే అని చెప్పటంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.


దీనితో యాజమాన్యానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ ధర్నా వెనక మాజీ సీఈవో ఉందని భావించిన యజమాన్యం ఉద్యోగుల మధ్య గొడవలు సృష్టించి తాము తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో... ఉద్యోగులకి మూడు నెలల జీతం ఇవ్వమని సీఈవో రేవతికి ఐదు కోట్లు ఇచ్చామని, కానీ ఆమె వాటిని తన స్వంతానికి వినియోగించిందని ఆరోపించింది.


అయితే ఈ విషయాన్నీ ఎవరు నమ్మటంలేదు. రెండు నెలల క్రితం ఉద్యోగంలో నుండి బయటకు పంపించిన రేవతికి మళ్ళి 5 కోట్లు ఎలా ఇస్తారు..మాలో మాకే గొడవలు పెట్టటానికే ఇలా చేస్తున్నారంటూ మోజో యాజమాన్యం మీద తిరగబడుతున్నారు. వీళ్ళకి తోడుగా రేవంత్ రెడ్డి వెనక ఉన్నాడు కాబట్టి ఇది ఎక్కడి దాకా పోతుందో అని భయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: