ఉత్తర కొరియా ఈ దేశం గురించి ప్రపంచానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ దేశం నుండి తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం పారిపోయి వచ్చిన ఎందరో శరణార్ధులు ప్రపంచం ముందు ఆ దేశంలో జరుగుతున్న దారుణాలు గురించి అక్కడ కిమ్ పరిపాలన గురించి ఎన్నో ఫార్మ్ లో చెప్పారు.అలాగే తమ దేశాన్ని కిమ్ కుటుంబం నుండి కాపాడవలసిందిగా కోరారు.అయిన ఏ దేశం దాని గురించి పట్టించుకోవట్లేదు.దీనికి కారణం   వారి దేశం విషయంలో ఎవరైనా కల్పించుకోవాలి అని చూస్తే వారి వద్ద ఉన్న అణ్వాయుధాలను ప్రయోగించడానికి వెనుకాడబోమని కిమ్ ప్రకటించిన ప్రకటన అనే చెప్పాలి.

మొదట్లో కిమ్ ను ఓడిస్తాం ఆ  దేశానికి విముక్తి కలిగిస్తాం అని ట్రంపు ప్రకటించారు. ఆ ప్రకటనలకు కిమ్ కూడా తనదైన శైలిలో అడ్డు వస్తే అమెరికా పైన కూడా అణుబాంబులు వేస్తాం అని ప్రకటించాడు దానితో అమెరికా సైతం వెనకకు తగ్గింది.తమతో స్నేహం కోసం చర్చలు జరిపింది.కాని అవి ఫలించలేదు.నిన్న జరిగిన అమెరికా మరియు దక్షిణ కొరియా సైనిక విన్యాసాల నేపథ్యంలో ఉత్తర కొరియా వాటిని వ్యతిరేకిస్తూ దక్షిణ హవాంగే ప్రావిన్సు నుండి రెండు గుర్తు తెలియని మిస్సైల్ ను పరీక్షించింది.

ఇలా ఉత్తర కొరియా గడిచిన రెండు వారాలలో నాలుగు మిస్సైల్ లను పరీక్షించింది.ప్రపంచంలో పేదరికంలో మగ్గుతున్న దేశంగా ఉన్న ఉత్తర కొరియా అణ్వాయుధాల పై తమ సొమ్మును ఖర్చు చేస్తుంది.దీనికి కారణం తమ దేశాన్ని విడిచి వెళ్ళిన శరణార్ధులు కిమ్ పై యుద్ధానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

అది సఫలీకృతమైతే తన పదవి కోల్పోవాల్సి వస్తుందనే భయంతో కిమ్ ఇలా దేశంలోని డబ్బునంతా అణ్వాయుధాలు పై ఖర్చు చేస్తున్నారని అలాగే మిస్సైల్స్ ప్రయోగాలు నిత్యం జరుపుతూ తమ దేశ విషయాల లో కలగచేసుకుంటే వారి పై  అణ్వాయుధాల ప్రయోగిస్తామనే భయాన్ని కలగచేయడానికి ప్రయత్నిస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు.మళ్ళీ ఉత్తర కొరియా మిస్సైల్స్ ప్రయోగంతో ప్రపంచాన్ని టెన్షన్ పెడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: