ఆ విద్యుత్‌ ఆపితే... మీ జేబులోంచి చెల్లించాల్సి వస్తుందని రాష్ట్రానికి కేంద్రం లేఖాస్త్రాన్ని సంధించింది. సౌర, పవన విద్యుత్తుపై రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖాస్త్రాన్ని పంపింది. తాము పేర్కొన్న కారణాలు కాకుండా మరే ఇతర కారణం చూపైనా ఈ విద్యుత్తు కొనుగోళ్లు ఆపితే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ జేబులోంచి ఉత్పత్తిదారులకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  ఈ మేరకు కేంద్ర పునర్వినియోగ విద్యుత్‌ శాఖ అదనపు కార్యదర్శి డీపీ యాదవ్‌ మూడు రోజుల క్రితం అన్ని రాష్ట్రాలకూ ఈ లేఖ పంపారు. ఈ విద్యుత్తును తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన ఇంతకుముందు నుంచే ఉందని ఆయన గుర్తు చేశారు. 


విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలిపోతుందని అనుకున్నప్పుడు లేదా గ్రిడ్‌ రక్షణ కోసమో మాత్రమే వాటి నుంచి విద్యుత్‌ తీసుకోవడం ఆపుచేయాలని తెలిపారు. అట్లాంటి సందర్భాలలో కూడా విద్యుత్‌ ఉత్పత్తిదారులకు ఆ కారణాన్ని లిఖితపూర్వకంగా తెలపాలని ఆయన స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్తును తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కావాలని అలా చేస్తే ఆ విద్యుత్తు తీసుకోకపోయినా దానికి సరిపోను డబ్బు ఆ కంపెనీలకి రాష్ర్టాలు చెల్లించాల్సిందేనని తెగేసి చెప్పింది.

తమ మంత్రిత్వ శాఖ ఆమోదంతోనే ఈ లేఖ పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం లేఖాస్త్రాన్ని పదే పదే సంధించడంతో రాజకీయ అనిశ్చితి పరిస్థితి ఏర్పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరో పక్క ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేఃదుకు టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు సమాచారం. చివరికి ఈ పవర్ రాజకీయం రాష్టాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళుతుందో కాలమే నిర్ణయించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: