అధిక వర్షాలు, ఆంధ్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా పోలవరం నిర్మాణం ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే, ఈ నేపధ్యంలో  పోలవరం హైడల్ ప్రాజెక్టు టెండర్ రద్దు వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం టెండర్ రద్దుకు సిద్ధమైన కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ముందుకెళ్లాలన్న వెనక్కి తగ్గాలన్నా చిక్కే ఉండటంతో ఏం చేయాలో తెలియక ఏపీ సర్కార్ హస్తిన వైపు చూస్తుంది. పోలవరం జల విద్యుత్ కేంద్ర నిర్మాణ టెండర్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ కోర్టులకు వెళ్లింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులు, జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు కలిపి ఒకే టెండర్ గా పిలవాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం పరిశీలిస్తుంది.



ఇప్పటి దాకా పోలవరం హైడల్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు కేంద్ర పరిధిలో ఉంది. నిర్మాణ పనులను రాష్ట్రం పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు ఈ రెండు పనులను కలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో దానికి కేంద్రం ఆమోదించాల్సి వస్తుంది. హెడ్ వర్క్స్ పనులకు తిరిగి టెండర్ పిలవాలా వద్దా అన్న దానిపై కేంద్రం వైఖరి ఇంకా తెలియాల్సి ఉంది. పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులను అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ను నవయుగ కంపెనీ దక్కించుకుంది. సుమారుగా 3,200ల కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఫలితంగా అతి చౌకగా 900 వందల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.



దీనిని సొంతంగా నిర్మించుకుంటే ఈ చౌక విద్యుత్ పూర్తిగా రాష్ర్టానికే ఉంటుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ప్రాజెక్టును విడదీసి విడిగా టెండర్ లు పిలిచి పని అప్పగించింది. ఈ పనిని దక్కించుకున్న నవయుగ కంపెనీ కొంత మేర పనులు మొదలుపెట్టినట్లు చెబుతుంది. అయితే పనులను నిలిపేయాలని కొద్ది రోజులక్రితం ప్రభుత్వ రంగ సంస్థ జెన్ కో నవయుగ కంపెనీకి నోటీసు పంపింది. దీనికి ఆ కంపెనీ సమాధానాన్ని పంపింది. తాము ఈ పనులు గడువు లోపు పూర్తి చేస్తామని అందులో తెలిపింది. నవయుగ నుంచి సమాధానం వచ్చిన తర్వాత జూలై 31 న విజయవాడలో జెన్ కో బోర్డు సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఈ బోర్డ్ ముందుకు వచ్చింది.



పోలవరం హెడ్ వర్క్స్ పనులు, జల విద్యుత్ కేంద్రం పనులు కలిపి ఒకే టెండర్ గా మళ్లీ పిలవాలని నిపుణుల కమిటీ సూచించింది. ఈ సూచనలను ఆమోదిస్తూ జెన్ కో బోర్డు తీర్మానం చేసింది. నవయుగ కంపెనీకి ఇచ్చిన పనులను రద్దు చేస్తేనే కొత్తగా టెండర్ లు పిలవడం వీలవుతుంది. పనుల రద్దుకు జెన్ కో బోర్డు తీర్మానం ప్రాతిపదిక కానుందని అధికార వర్గాలంటున్నాయి. టెండర్ పిలవడానికి కేంద్రం ఆమోదం రాకపోడంతో జల విద్యుత్ కేంద్రం పనుల రద్దుపై నవయుగ కంపెనీకి ఇంకా నోటీస్ పంపలేదని సమాచారం. కాగా నవయుగతో అవగాహనకు రావడం ద్వారా టెండర్ల రద్దు న్యాయ వివాదం కాకుండా చూసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతుంది. సౌర, పవన విద్యుత్తుపై రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖాస్త్రాన్ని పంపించింది. తాము పేర్కొన్న కారణాలు కాకుండా మరే ఇతర కారణం చూపైనా ఈవిద్యుత్ కొనుగోళ్లు ఆపితే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ జేబులోంచి ఉత్పత్తిదారులకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.



కేంద్ర పునర్వినియోగ విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శి బిపి యాదవ్ మూడ్రోజుల క్రితం అన్ని రాష్ర్టాలకూ ఈ లేఖ పంపారు. ఈ విద్యుత్తును తప్పని సరిగా తీసుకోవాలన్న నిబంధన ఇంతకు ముందు నుంచే ఉందని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ గ్రిడ్ కుప్పకూలిపోతుందని అనుకున్నప్పుడు లేదా గ్రిడ్ రక్షణ కోసం మాత్రమే వాటి నుంచి విద్యుత్ తీసుకోవటం ఆపుచేయాలని తెలిపారు. అలాంటి సందర్భాలలో కూడా విద్యుత్ ఉత్పత్తి దారులకు ఆ కారణాన్ని లిఖిత పూర్వకంగా తెలపాలని ఆయన పేర్కొన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థల నుంచి విద్యుత్తును తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కావాలనే అలా చేస్తే ఆ విద్యుత్ తీసుకోకపోయినా దానికి సరిపోను డబ్బు ఆ కంపెనీలకి రాష్ర్టాలు చెల్లించాల్సిందేనన్నారు. తమ మంత్రిత్వ శాఖ ఆమోదంతోనే ఈ లేఖ పంపుతున్నట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: