అరికల్ 370 రద్దు , కశ్మీర్ విభజన బిల్లుపై రాజ్యసభ లో నోరుమెదపని తెరాస , లోక్ సభ లో మాత్రం బిల్లుకు మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది . రాజ్యసభ లో జరిగిన రోజంతా చర్చలో సభలోనే ఉన్న ఆ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు కేశవరావు మౌనంగా ఉన్నారే ... తప్పితే బిల్లు పై మాట్లాడేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు . ఇటీవల ట్రిపుల్ తలాక్ బిల్లు పై కూడా తెరాస మౌన ముద్ర దాల్చించింది . కశ్మీర్ విభజన , 370 ఆర్టికల్ రద్దు అంశాలపై కూడా తెరాస , ట్రిపుల్ తలాక్ బిల్లు తరహాలోనే తప్పించుకునే ప్రయత్నాన్ని చేస్తోందన్న విమర్శలు విన్పించాయి .


 ఈ నేపధ్యం లో  లోక్ సభ లో జరిగిన చర్చ లో తెరాస పాల్గొనడమే కాకుండా , కేంద్ర ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నట్లు పేర్కొంటూనే , పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆ పార్టీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు సూచించారు . కశ్మీర్ విభజన బిల్లును వ్యతిరేకిస్తే దేశ ప్రజలు వారిని ద్రోహులుగా చూస్తారని , తమ పార్టీ ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతునిస్తున్నదని అన్నారు . అంతటి తో ఆగకుండా ఈ బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని విపక్షాలను కోరారు . ఇకపై కశ్మీర్ లో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగి , స్థానిక ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని అన్నారు .


 కశ్మీర్ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ఈ రోజు వాళ్లకు ఎందుకు చీకటి దినం అవుతుందని , క్రాంతి దినం అవుతుందని నామా నాగేశ్వరరావు చెప్పారు . మొత్తం మీద తొలిరోజు  కశ్మీర్ విభజన , ఆర్టికల్ 370 రద్దుపై డైలమా లో ఉన్న టీఆరెస్ నాయకత్వం, దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలు చూసి  సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు స్పష్టం అవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: