ఈరోజు లోకసభలో కాశ్మీర్ బిల్లు ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.దాని సందర్భంగా జరిగిన చర్చలో కాంగ్రెస్ బీజేపీని 370 అధికరణను రద్దు చేయడం జమ్ము కాశ్మీర్ ను విభజించడం తప్పుపట్టింది. బీజేపీ చేసిన ఈ చర్య ద్వారా కాశ్మీర్ కు ప్రధాన ఆదాయంగా ఉన్న టూరిజం దెబ్బ తిందని ఈ చర్య ద్వారా కాశ్మీర్ యువత మరింతగా టెర్రరిజం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఇది సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని మార్చుకోవాలని శశిధరూర్ మరియు ఇతర కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

ఇంకొంతమంది కాంగ్రెస్ ఎంపీలు మరో అడుగు ముందుకేసి కాశ్మీర్ ల మనస్సు గెలవకుండా ఇలా చేయడం ద్వారా భారత్ మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని దానికి బీజేపీ బాధ్యత వహించాలని విమర్శించారు.దీనికి బీజేపీ లడక్ ఎంపీ సేరింగ్ నమ్‌గ్యాల్ తమ ప్రాంతం వారు ఈ బిల్లును స్వాగతిస్తున్నారని ఇన్నాళ్లకు తమకు న్యాయం చేసిన ప్రధాని మోడీ గారికి లడక్ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.అలాగే  370 అధికరణను రద్దు చేయాలని తమ ప్రాంతం వారు చాలా కాలంగా కోరుతున్న దానిని కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని అని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ కు కాశ్మీర్ లో గద్దెను ఎక్కడం పై ఉన్న శ్రద్ధ తమ ప్రాంతం వారి అభిప్రాయాలను పట్టించుకోవడం పై లేదని  విమర్శనాస్త్రాలు సంధించారు.

లడక్ ప్రాంతంలో ఒక యూనివర్సిటీని, హాస్పిటల్ ను నిర్మించడానికి కాంగ్రెస్ కాని కాశ్మీర్ ప్రభుత్వాలు కాని పూనుకొలేదని వాటిని తొలిసారిగా  ఏర్పాటు చేయాలని అలోచించింది,అమలు చేసింది మోడీనే అని అది  ఇప్పుడు విమర్శిస్తున్న పార్టీలు గుర్తుంచుకోవాలని అన్నారు.  తమ ప్రాంతానికి ఇచ్చిన నిధులను కాశ్మీర్ వారు ఎత్తుకుపోతుంటే ఇన్ని రోజులు చోద్యం చూసిన కాంగ్రెస్ ఇప్పుడు మాకు మంచి జరుగుతున్నప్పుడు ఇలా వ్యవహరించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పై చలోక్తులు విసిరి సభలో ఉన్న వారందరినీ నవ్వించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: