ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టికల్ 370 పైనే చర్చలు నడుస్తున్నాయి.  కశ్మీర్ విభజన పై అత్యుత్సాహం ప్రదర్శించిన పాకిస్తానీ ఆల్ రౌండర్ అఫ్రిదీ కి భారత మాజీ ఓపెనర్, రాజ్య సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే… బీజేపీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాత అఫ్రిదీ ఒక ట్వీట్ వేశాడు.
అందులో అతను కశ్మీర్ పునర్విభజన పై మోడీ సర్కారు వైఖరిని తప్పుబడుతూ, కశ్మీర్ వాసులకు ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన విధంగా ప్రాథమిక హక్కులు ఇవ్వాల్సింది గా అతను అన్నాడు. 

అసలు ఐక్యరాజ్య సమితి ఎందుకు ఉంది?  ఇప్పుడెందుకు నిద్ర పోతోంది? మానవత్వానికి వ్యతిరేకంగా కశ్మీర్ లో నేరాలు.. ఘోరాలు జరుగుతున్న విషయాల్ని గుర్తించాలని ఆ ట్వీట్ లో అతను పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నాడు.


దీని పై నేటిజెన్లు అఫ్రిదీ పై ఒక రేంజిలో ఊగిపోయారు. పలువురు ప్రముఖులు తిట్టిపోశారు కూడా. అయితే వాటిల్లో గౌతమ్ గంభీర్ ఇచ్చిన పంచ్ మాత్రం ప్రత్యేకం. ఇక బదులు చెప్పే అవకాశం లేకుండా స్పందించిన గంభీర్ ముందుగా ఇలాంటి విషయాల్లో చురుగ్గా ఉండే అఫ్రిదీ ని అభినందించాడు. ఇంకా అతను చెప్పింది ముమ్మాటికీ నిజమే అంటూ అయితే.. అతడో చిన్న విషయాన్ని మర్చిపోయాడు అని అన్నాడు. అతను చెప్పినవన్నీ జరుగుతోంది పాక్ అక్రమిత కశ్మీర్ లోనే అంటూ ఒక రేంజులో సెటైర్ వేసేశాడు.


ఇక బదులు ఇవ్వలేని విధంగా తాము త్వరలోనే పీ.ఓ.కే (పాక్ ఆక్రమిత కశ్మీర్) లో పరిస్థితులు కూడా సరిచేస్తాం అని చురకలు అంటించాడు. దీంతో గౌతమ్ గంభీర్ ట్వీట్ పై పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: