కేంద్రంలో బీజేపీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది. అయితే కొత్తగా ఏర్పడ్డ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు బిన్నభిప్రాయాలని వ్యక్తపరిచాయి. కాశ్మీర్ ఆందోళనలతో ఊగిపోతుండగా, లడఖ్ ప్రజలు మాత్రం సంబరాల్లో  తేలిపోతున్నారు. 


కశ్మీర్ లో దీనిపై వేర్పాటువాదులు- ముస్లింలు ఆందోళనలతో అట్టుడికిస్తున్నారు. చాలా చిత్రంగా లడఖ్ లో ప్రజలు ఆ ప్రాంతం మంత్రితో కలిసి చిందులేస్తున్నారు. ఒక పక్క కశ్మీర్ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరుస్తుంటే, మరో పక్క లడఖ్ నేతలు బిజేపీ నేతలను కలిసి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. నిజానికి లడఖ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఆ మార్చి ఆ ప్రాంతానికి కేంద్రం ఊపిరిలూదిందనే చెప్పాలి. వారు అనుభవించిన బాధలు, బయటకు చెప్పుకోలేని కన్నీటి కథలు అలాంటివి మరి.


జమ్మూ కశ్మీర్ లో 40 శాతం భూ భాగం ఉండే లడఖ్ టిబెట్ బార్డర్ కు ఆనుకొని హిమాలయ సానువుల్లో ఉంటుంది. కావున అక్కడ అత్యధికంగా బౌద్ధ సనాతన ధర్మాలను పాటిస్తారు. మరో పక్క కాశ్మీర్ లో ముస్లిం లు ఎక్కువ. 1947లో పాకిస్తాన్ ప్రేరేపిత దాడులతో లడఖ్ సర్వస్వం కోల్పోయింది. ఆర్థికంగా దోపిడీకి గురై హిమాచల్ ప్రదేశ్ కు వలసవెల్లారు. చాలా మంది లడఖ్ వాసులు బిచ్చగాళ్ల గా మారారు. మిగిలిన వారిని ఉగ్రవాద ముసుగులో చంపేశారు. 


ఇక కాశ్మీర్ ప్రభుత్వంలో నిధులలో సింహ భాగం కశ్మీర్ కే వెళ్లడంతో లడఖ్ ప్రజలకు కేవలం రిక్త హస్తాలు మాత్రమే మిగిలేవి. అదే కాకుండా వారి లడఖ్ భాష ను కాదని అక్కడ కూడా ఉర్దూ భాషనే అధికారిక భాషగా ప్రవేశ పెట్టారు. ఇలా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా కశ్మీరీల చేతుల్లో లఢక్ వాసులు ఇన్నాళ్లు దోపిడీకి గురయ్యారు. ఇప్పుడు వారికి ప్రత్యేకంగా హోదా ఇచ్చి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాత వారికి తమ జీవితాలను మెరుగు పరుచుకునే అవకాశం వచ్చిందని వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండానే పోయాయి. సంబరాలు అంబరాన్ని అంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: