గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో స్థానిక సమస్యలతో నిలిచిపోయిన కొన్ని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించి ఇళ్ల నిర్మాణాలను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలియజేశారు. నగరంలో డబుల్ బెడ్ రూ ఇళ్ల నిర్మాణం పురోగతి, ఎదరవుతున్న సమస్యల పరిష్కారంపై జీహెచ్ఎంసి హౌసింగ్ విభాగం ఇంజనీర్లు, హైదరాబాద్ జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

జిహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, చీఫ్ ఇంజనీర్ సురేష్, కార్పొరేటర్ బంగారి ప్రకాష్ తదితరులు హాజరయ్యారు.  ఈ సమావేశంలో మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. బోజగుట్ట హౌసింగ్ కాలనీ నిర్మాణానికి కేవలం కొద్ది మంది మాత్రమే అడ్డు తలుగుతున్నారని చెప్పారు. ఈ కారణంగా మొత్తం ప్రాజెక్ట్ పనులు 70శాతం మేరకు నిలిచిపోయాయన్నారు. ఈ విషయంలో అడ్డు తలుగుతున్న వారి సమస్యను పరిష్కరించాలని మేయర్ సూచించారు. అదేవిధంగా ఇప్పటికీ అంగీకరించని స్థానిక బస్తీవాసులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు పై ముందస్తుగా మంజూరు పత్రాలను అందజేయాలన్నారు.

అప్పుడే వారికి ప్రభుత్వం పైన విశ్వాసం కల్పించాలని సూచించారు. ఐమాక్స్ సమీపంలోని ఇందిరానగర్ లో రెండు బ్లాక్ లలో నిర్మాణం నిలిచిపోయిందన్నారు.  ఈ విషయంలో ఏర్పడ్డ వివాధాన్ని పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఏ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి సమీపంలో ఉన్న రెండు ఎకరాల ఖాళీ స్థలాన్ని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించాల్సిందిగా కోరుతూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాయాలని కమిషనర్ కు సూచించారు. ఈ భూమి విషయంలో ఇప్పటికే జీహెచ్ఎంసి, రెవెన్యూ అధికారుల ఉమ్మడి సర్వే పూర్తి అయ్యిందని కమిషనర్ దాన కిషోర్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: