2019 వ సంవత్సరం బీజేపీకి ఎంతగానో కలిసి వచ్చింది.  ఈ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  గతంలో బీజేపీ చేసిన నోట్ల రద్దుపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి మోడీ ప్రభుత్వానికి ఓట్లు పడవని అంతా ఊహించారు.  కానీ, వారి ఊహలకు వ్యతిరేకంగా జరిగింది.  ఎవరూ ఊహించనంతగా మెజారిటీ ఇచ్చి ప్రజలు మోడీని గెలిపించారు.  



ఈ విజయంతో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన వెంటనే ముమ్మూరు తలాక్ బిల్ ను రద్దు చేసింది.  దీంతో ముస్లిం మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సంతోషంతో చాలామంది ముస్లిం మహిళల హృదయాల్లో మోడీ హీరో అయ్యాడు.  వ్యతిరేకించిన ముస్లింలే ఓటు వేసి గెలిపించారు.  యూపీ కనీసం 40 స్థానాలు కూడా గెలవరని ప్రచారం చేసిన పార్టీల మనుగడ ప్రశ్నర్ధకంగా మారింది.  కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్కసీటును మాత్రమే గెలుచుకోవడం విశేషం.  అటు ఎస్పీ, బిఎస్పీలు కూడా ఫెయిల్ అయ్యాయి.  



ఎప్పుడైతే రెండోసారి అఖండ మెజారిటీ ఇచ్చి బీజేపీని గెలిపించారో ఆ వెంటనే చెప్పినట్టుగా ట్రిపుల్ తలాక్ ను రద్దు చేశారు.  దీన్ని రద్దు చేయడంతో దేశంలోని ముస్లిం మహిళలకు మోడీపై నమ్మకం ఏర్పడింది.  అనుకుంటే ఏదైనా చేయగలడు అని అనుకున్నారు. 


రీసెంట్ గా ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన వంటి బిల్లులను ప్రవేశపెట్టి కాశ్మీర్ సమస్యకు ఒక శాశ్వతమైన పరిష్కారం తీసుకొచ్చే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాడు.  72 ఏళ్లుగా దేశంలో సమస్యగా ఉన్న కాశ్మీర్ ను గంటల వ్యవధిలో పరిష్కారం చూపడంతో..మోడీ దేశంలో హీరో అయ్యాడు.  మోడీకి దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ పెరుగుతున్నది.  మరోవైపు వచ్చే ఏడాది ఇచ్చే నోబెల్ పీస్ ప్రైజ్ ను మోడీకి ఇవ్వాలని యువత ఇప్పటికే నుంచే మెసేజ్ లు చేస్తుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: