ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా కొత్త సామెతను కనిపెట్టారు. 'యధా రాజా - తధా ప్రజా' అని మాములుగా ప్రజలు అంటుంటారు. 


కానీ మాజీ మంత్రి నారా లోకేష్ ఆలా అనరు. ఆలా అన్నారు అంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు వెయ్యరు కదా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. నెటిజన్లు ఆలా అనడానికి గల కారణం నారా లోకేష్ పెట్టిన ట్విట్ ఏ కారణం. ఆ ట్విట్ ఇదే 'యథా సీఎం... తథా మంత్రి అన్నట్టు నోటికొచ్చిన అబద్ధాలతో ఎవరికివారు టీడీపీపై బురదచల్లేవారే కానీ ఈ ఆరోపణలపై కనీస అవగాహన కూడా ఉండటంలేదు వైసీపీ వాళ్ళకు. రిలయన్స్ కంపెనీ పేరుతో ఒక ఫేక్ కంపెనీని సృష్టించి 1000 ఎకరాలు కొట్టేసేందుకు టీడీపీ కుట్ర చేసిందని మంత్రి గౌతమ్ రెడ్డి ఆరోపించారు.' అంటూ ఫోటోలు జత చేసి ట్విట్లు పెట్టారు నారా లోకేష్.  


 ఈ ట్వీట్లకు స్పందిస్తున్న నెటిజన్లు 'మీరు పెట్టె ట్విట్లు కూడా అలానే ఉన్నాయి లోకేష్ గారు' అని ఒకరు ట్విట్ చేస్తే మరికొందరు నెటిజన్లు రోజు నీ ట్వీట్లతో చాలా కామెడీ చేస్తున్నావ్ అంటూ ట్విట్ చేశారు. మరి ఈ ట్విట్లకి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: