కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల. చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కాళేశ్వరం వరద ఉధృత పెరిగింది. ఈ క్రమంలో ప్రాణహిత నుండి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వరద ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. 45 లక్షల ఎకరాలకు సాగునీటి అవసరాలకు సమకూర్చాలన్నారు. అదే విధంగా పారిశ్రామిక అవసరాలతో సహా 80 శాతం తెలంగాణకు తాగునీటిని అందించే విషయంలో కీలకమైన కాళేశ్వరం కీలకమైందన్నారు.

ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్‌  పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ నిపుణుల పనితనాన్ని ప్రశంసించారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 150 కిలో మీటర్ల మేర నీరు నిలిచిపోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో  రివర్ బేసిన్ ను స్వయంగా పరిశీలించేందుకు కేసీఆర్ తరలించారు.  ఉన్నతాధికారులతో కలిసి రెండు హెలికాప్టర్‌లలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. 

తొలుత ముఖ్యమంత్రి  మేడిగడ్డ హెలిప్యాడ్ నుంచి బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడ బ్యారేజీ పొడవునా చాలా దూరం కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి మాతకు పూలు, పసుపు, కుంకుమతో కూడిన వాయినం సమర్పించారు.  అనంతరం నాణాలను నదిలోకి జారవిడిచారు. ఈ విధంగా కేసీఆర్ తన కాళేశ్వరం పర్యటనను కొనసాగించారు.అంతకు ముందు ప్రొ. జయశంకర్ జయంతిని సందర్బంగా సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషములో వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. నివాళులు అర్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: