కేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్ అనారోగ్యం కారణంతో తీవ్ర అస్వస్థతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గుండె పోటుతో ఆమె చాలా ఇబ్బందిగా సుష్మ పరిస్థితి ఉంది. కొద్ది సేవటి క్రితమే పార్లమెంటులో 370 ఆర్టికల్ గురించి హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన జీవితకాలంలో ఇటువంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

గుండెపోటు రావటంతో కుటుంబీకులు ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ లో చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందారు. మృతి సంబందించి అన్ని రాకాలుగా నిర్ధారణచేసుకున్న తర్వాత మాతమ్రే వైద్యులు ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న మృతి ఆమెను చూసేందుకు ఇప్పటికే కేంద్రమంత్రులు, భారతీయ జనత పార్టీ నాయకులు ఆసుపత్రికి తరలి వస్తున్నారు.

బీజేపీలో మహిళ ఉన్నత నేత కావడంతో ఆమె చూసేందుకు చాలా మంది అక్కడే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలతో ఆసుపత్రి పరిసరాలు నిండిపోయాయి. సుష్మ మృతితో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వైద్యులు ఎలాంటి వివరణ ఇవ్వకపోడంతో ఆమె మృతి నిజమా కాదా అని అందరు నిర్ఘాతంలో ఉన్నారు. మరికాసేపటిలో ఎయిమ్స్ వైద్యులు వెల్లడించనున్నారు. తాజా జరిగిన ఎన్నికల్లో అనారోగ్య కారణంతో ప్రచారాల్లో పాల్గొనలేదు ఆమె. ఇటీవలే ఆమె మూత్రపిండాలకు సంబందించిన చికిత్స కూడా చెయించుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.

ఇప్పటికే సుష్మ ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నతమైన పదవులు అధిరోహించారు. 1952 ఫిబ్రవరి 14 జన్మించిన ఆమె మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆమె మరణంతో భారతీయ జనతా పార్టీలో శోక వాతావరణం నెలకొంది. సీనియర్ మహిళను భారతీయ జనత పార్టీ కొల్పోవడంతో చాలా మంది ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: