రాజకీయ నాయకులలో అరుదైన నేత చంద్రబాబు. ఆయనకు ఊపిరి రాజకీయం. పడినా తనదే పై చేయి అనే రకం చంద్రబాబు. తాజా ఎన్నికల్లో టీడీపీ కలలో కూడా వూహించని  విధంగా దారుణమైన సీట్లు దక్కాయి. మరొకరు అయితే ఈ పాటికి కాడి వదిలెసేవారు. కానీ చంద్రబాబు కదా అక్కడ ఉన్నది. మళ్ళీ ఆయన తనదైన పాలిటిక్స్ స్టార్ట్ చేసేశారు. ఇపుడు ఆయన ఏపీలో కొత్త సర్కార్ విషయంలో సరికొత్త ప్లాన్ వేశారు.


జగన్ని బదనాం చేయాలి. ఇది బాబు టార్గెట్. క్రికెట్ ఆటలో మంచి ఆటగాడిని ఔట్ చేస్తే టీం మొత్తం కుప్పకూలుతుంది. రాజకీయాల్లోనూ అంతే, అధినాయకుడి మీద బురద జల్లితే ఎంతటి బలమైన పార్టీ కానీ, బంపర్ విక్టరీ కొట్టిన పార్టీ కానీ ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం ఈ విషయంలో బాబు లాజిక్ తో ముందుకు సాగుతున్నారు. జగన్ సర్కార్ మీద విషం చిమ్ముతున్నారు. దాని కోసం ఆయన చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు.


నిజానికి రెండు నెలల వ్యవధి అంటే ఏ సర్కార్ కి అయినా చాలా తక్కువ సమయం ఇందివరకు ఓ ప్రభుత్వానికి హానీమూన్ పీరియడ్ అని విపక్షాలు, ప్రజలు కూడా ఇచ్చేవారు. అది అరు నెలల నుంచి ఓ ఏడాది వరకూ ఉండేది. అంటే కొత్త ప్రభుత్వం పాలనా ఫలితాలు దిగువ స్థాయికి చేరి వారి నుంచి వచ్చే స్పందనను బట్టి ప్రతిపక్షాలు  తమ ఆందోళను, పోరాటాలు నిర్ణయించుకునేవి. కానీ ఇపుడు చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులు అలాంటి సమయం ఇవ్వడంలేదు.


నేను జగన్ సర్కార్ కి సమయం ఇవ్వదలచుకోలేదని బాబు పదే పదే మీడియా ముందు చెప్పెస్తున్నారు. ఇది అసమర్ధ ప్రభుత్వం, అరాచక ప్రభుత్వమ ని ఆయన దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటూ హూంకరిస్తున్నారు. నిజానికి జగన్ సర్కార్ ఎన్నో మంచి పనులు ఈ రెండు నెలల వ్యవధిలోనే చేసింది. బీసీలను, బడుగులను అగ్ర భాగాన నిలబెట్టింది. అవినీతిపై ఉక్కుపాదం మోపింది.


పారదర్శక పాలన అంటోంది. దుబారా తగ్గిస్తోంది. ఇలా ఎన్నో చేస్తున్నా కూడా చెప్పుకోవడానికి సర్కార్ వైపు నుంచి బలమైన వాయిస్ లేదు, కొత్త ప్రభుత్వం తడబాట్లు పొరపాట్లు మాత్రం టీడీపీ అనుకూల మీడియా హైలెట్ చేస్తోంది.దాన్ని పట్టుకుని చంద్రబాబు రెచ్చిపోతున్నారు. గ్రౌండ్ లెవెల్లో జగన్ని పూర్తిగా విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని ఫలితాలు, పర్యవ‌సానాలు ఎలా ఉంటాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: