ఆగస్ట్ 5, 6.. భారత దేశ చరిత్రలోనే కీలకమైన రోజులుగా చరిత్ర గుర్తుంచుకుంటుంది. 70 ఏళ్లుగా భారత్ కు సమస్యాత్మకంగా మారిన జమ్మూకాశ్మీర్ అంశంపై ఏ ప్రధాని చేయనంతటి సాహసం మోడీ చేసిన రోజులువి.. ఇంటా బయట విమర్శలను ఎదుర్కోవాల్సిన కీలక సమయం. రాజ్యసభలోనూ, లోక్ సభలోనూ బిల్లును పాస్ చేయించుకోవాల్సిన సందర్భం.


మూడో కంటికి తెలియకుండా మోడీ- అమిత్ షా పక్కా వ్యూహం అనుసరించిన అద్భుతమైన సమన్వయం.. ఇంతటి కీలక సమయంలో మోడీ అపాయింట్మెంట్ దొరకడం అంటే మాటలు కాదు. ఓవైపు దేశంలోని వివిధ పార్టీల రియాక్షన్లు చూస్తూ.. మరోవైపు అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను పరిశీలిస్తూ తగిన వ్యూహం రూపొందించాల్సిన కీలక సమయం.


ఇలాంటి టఫ్ టైమ్ లో కూడా మోడీ జగన్ తో భేటీ అయ్యాడు. ఇది ముందుగా ఏర్పాటు చేసుకున్న సమావేశమే అయినా మంగళవారం నాటి పరిస్థితి చూస్తే జగన్ తో మోడీ భేటీ అవుతారా అనుకున్నారు చాలా మంది. కానీ మోడీ అంత బిజీలోనూ జగన్ కు ప్రయారిటీ ఇచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు జగన్ తో భేటీ అయ్యారు. ఈ సమయంలో రాష్ట్రాభివృద్ధికి ఆర్థికి సాయం చేయాలని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది.


ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని మోదీని కోరినట్టు సమాచారం. ఇక మోదీతో భేటీకి ముందు సౌత్‌ బ్లాక్‌లో పీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బృందం 40 నిముషాలపాటు సమావేశమైంది. సీఎంతో పాటు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, బాలశౌరి, రఘురామకృష్ణంరాజు, ఇతర ఎంపీలు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: