మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి అస్వవ్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె చికిత్స పొందుతూ కన్ను మూశారు. మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ లోని అత్యవసర విభాగంలో ఆమెకు చికిత్స అందిస్తున్న సమయంలో తీవ్రమైన గుండె నొప్పితో ఆమె కన్నుమూశారు.  అయితే సుష్మా స్వరాజ్ ఆసుపత్రిలో మరణించిందన్న వార్త వినగానే కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, గడ్కరీ, హర్ష వర్ధన్‌ తదితరులు హుటాహుటిన ఎయిమ్స్ కు చేరుకున్నారు. 


లాయర్ నుంచి కేంద్ర మంత్రిగా రాజకీయం ప్రస్థానం :
లాయర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన అనంతరం రాజకీయాల్లో చేరి, అనతికాలంలోనే దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  సుష్మా స్వరాజ్‌ 1952, ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. విద్యార్థి సంఘం నాయకురాలిగా ఆమె 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1996, 1998లో వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేశారు.1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.  ప్రధాని మోదీ కేబినెట్‌లో 2014 మే 26న కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె అనారోగ్యంగా ఉండటంతో లోక్‌సభ ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. 


ఎన్నికల షెడ్యూల్ :
సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు నేటి సాయంత్రం లోధీ రోడ్ లోని స్మశాన వాటికలో జరుగనున్నాయి. నిన్న రాత్రే ఆమె పార్థివ దేహాన్ని జంతర్ మంతర్ లోని నివాసానికి తరలించగా, అప్పటి నుంచి పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పిస్తున్నారు.  దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఉంచనున్నట్లు చెప్పారు. 3 గంటల తరువాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయం, లోధీ రోడ్ కు వెళ్లే రహదారులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: