రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి.. సెంటిమెంట్ అంటేనే లాజిక్ కు అందనిది కదా.. అలాంటిదే వైఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది.. గతంలో 1994-2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉండేవి.. వర్షాలు.. లేవు.. కరువు, కాటకాలు.. విద్యుత్ కోతలు.. రైతు ఆత్మహత్యలు..


ఆ సమయంలోనే గోరెటి వెంకన్న కలం నుంచి జాలు వారిన పల్లె కన్నీరు పెడుతుందో అన్న పాట.. ఆనాటి పరిస్థితికి అద్దం పట్టింది. 2004లో వైఎస్ అధికారంలోకి రాగానే.. ఆ ఐదేళ్లూ వర్షాలు బాగా కురిశాయి.. పంటలు బాగా పండాయి. ఇప్పుడు జగన్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీటవుతోంది.


2009 నుంచి 2019 వరకూ ఈ పదేళ్లలో తెలుగు రాష్ట్రాలకు కీలకమైన దేశంలోనే రెండో అతిపెద్దదైన నాగార్జున సాగర్ బోసిపోయింది. అడపా దడపావచ్చే కాసిని నీళ్లు తప్ప.. ఏనాడూ పూర్తిగా నిండలేదు.. కృష్ణానదిలో ప్రవాహం తగ్గిపోవడం.. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టడంతో సాగర్ బోసిపోతోంది.

అలాంటిది ఇప్పుడు 2019లో జగన్ అధికారంలోకి రాగానే సీన్ మారింది. కృష్ణానదికి గత పదేళ్ల తర్వాత తొలిసారిగా భారీ వరద కొనసాగుతోంది. కృష్ణాపై కర్ణాటకలో ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి దశాబ్దం తర్వాత భారీగా వరద నీరు విడుదలవుతోంది. మంగళవారం 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలంలోకి 2.82 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. సగటున రోజుకు 23 టీఎంసీలకు పైగా వరద శ్రీశైలంలోకి వస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 135 టీఎంసీలకు చేరింది. మరో 80 టీఎంసీలు వస్తే ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. రెండు రోజుల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు నీటి విడుదల ప్రారంభమైంది. సోమవారం 45 వేల క్యూసెక్కులు, మంగళవారం 80 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం నుంచి దిగువకు విడిచిపెట్టారు.


ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో శ్రీశైలం నిండుకుండలా మారుతుంది. ఇక, నాగార్జునసాగర్‌ నిండటానికి 186 టీఎంసీలు అవసరం. దీని నీటిమట్టం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 120 టీఎంసీలు మాత్రమే ఉంది. మొత్తానికి రావటం లేటు కావచ్చేమో కానీ రావటం పక్కా.. వైస్సార్ పార్టీ అధికారం లోకి రాగానే కృష్ణా నది పరుగులు, నాగార్జున సాగర్ కు వరద నీరు 10 సంవత్సరాల తరువాత.. దటీజ్ వైఎస్సార్ అంటున్నారు వైఎస్ ఫ్యాన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: