కొన్ని సార్లు జరిగే విషాద సంఘటనలు ఆత్మీయులనే కాదు..యావత్ ప్రజానికాన్ని శోక సంద్రంలో ముంచి వేస్తుంది.  ముఖ్యంగా దేశానికి తమ వంతు సేవ చేసి అందరి మన్ననలు పొంది ప్రముఖ వ్యక్తులు మరణ వార్త వింటే ఎవ్వరికైనా కంట తడి రావాల్సిందే.  అలాంటిది దేశ రాజదాని ఢిల్లీకి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ఇద్దరు మహిళామణులు ఒకే నెలలో కొద్ది రోజుల వ్యధిలోనే కన్నమూయడం దేశ ప్రజలను విశాద ఛాయలో ముంచేసింది. జులై 20వ తేదీన గుండెపోటుతో షీలాదీక్షిత్‌ తుదిశ్వాస విడువగా, సరిగ్గా నెలరోజులు కూడా గడవలేదు.. మరో మహిళా నేత సుష్మాస్వరాజ్‌ అదే తరహాలో కన్నుమూశారు.  

షీలా దీక్షిత్ :
కాంగ్రెస్‌కు పార్టీకి జీవితాంతం సేవలందించిన షీలాదీక్షిత్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడుసార్లు ప్రజలకు సేవలందించిన ఆమె మృతి కాంగ్రెస్ నేతలను కన్నీరుమున్నీరు చేసింది. ముఖ్యమంత్రిగా ధీటైన పాలన అందించిన షీలాదీక్షిత్‌ మానవత్వం ఉన్న మహిళ ప్రముఖ నేతలు ఆమెను కొనియాడారు. 1938 మార్చి 31న పంజాబ్‌ కపుర్తలలో షీలాదీక్షిత్‌ జన్మించారు.

ఢిల్లీ యూనివర్సిటీ ఎంఏ హిస్టరీ విద్యను అభ్యసించారు. 1984 నుంచి 1989 వరకు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రిగా పని చేశారు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ సీఎంగా 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి సేవలు అందించారు. 2013లో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో షీలాదీక్షిత్‌ ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో ఆరు నెలల పాటు కేరళ గవర్నర్‌గా పని చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా షీలా దీక్షిత్ పోటీ చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ నుంచి పోటి చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్నారు.

సుష్మా స్వరాజ్ :
సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశ మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు.  1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు.  అప్పటి నుంచి వరుసగా ఎన్నో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

2004 ఏప్రిల్లో సుష్మాస్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైంది. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేసింది. జనవరి 2003 నుంచి మే 2004 వరకు మరో రెండూ శాఖలు అదనంగా చేపట్టింది. 2006 ఏప్రిల్లో మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతోంది. మెడీ కేబినేట్ లో ముఖ్య భూమిక పోషించారు.  మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో చికిత్సకోసం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 2019, ఆగస్టు 6 రాత్రి మరణించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: