జనసేన పార్టీ 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసారు.  జనసేన పార్టీని ఏర్పాటు చేసిన తరువాత పవన్ అప్పట్లో బీజేపీకి.. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు.  పవన్ ఆ రెండు పార్టీల తరపున ప్రచారం చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.  ఆ తరువాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా ఆ రెండు పార్టీలకు పవన్ దూరంగా ఉంటూ వస్తున్నాయి.  2019 ఎన్నికలకు ముందు పవన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు.  ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.  



అయితే, పార్టీలో బలమైన నేతలు లేకపోవడంతో గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.  కేవలం ఒకేఒక్క సీటును గెలుచుకున్నారు.  రాజోలు నుంచి పోటీ చేసిన రాపోలు ప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు.  పవన్ రెండు చోట్ల నుంచి పోటీ చేసినా.. ఒక్కచోట కూడా విజయం సాధించలేదు పవన్.  ఎన్నికల తరువాత పవన్ పార్టీని పక్కన పెడతారని వార్తలు వచ్చాయి. ఎన్నికల తరువాత పవన్ అమెరికా వెళ్లడం.. అక్కడ బీజేపీ కీలక నేత రామ్ మాధవ్ తో సమావేశం కావడంతో అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి.  



కానీ, పవన్ కళ్యాణ్ అమెరికా నుంచి వచ్చిన తరువాత, జనసేన పార్టీని ఎట్టి పరిస్థితిల్లో కూడా వేరే పార్టీలో విలీనం చేసే ప్రసక్తి లేదని అన్నారు.  ఏ పార్టీతో చేతులు కలపబోమని అన్నారు.  దీనిపై బీజేపీ నేత, సినీనటి మాధవి స్పందించింది.  పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా బీజేపీతో చేతులు కలపాల్సిందే అని చెప్పింది.  జనసేన పార్టీని ఎప్పటికైనా బీజేపీలో కలపడం జరుగుతుందని అంటున్నారు.  పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపితే పవన్ కు కలిసి వస్తుందని, లేదంటే పవన్ ఎప్పటికి రాజకీయాల్లో ఎదగలేరని అన్నారు.  ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: