ఏపీలో రాజకీయ శూన్యత ఉందన్నది అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి సీన్ కాలింది. మొన్నటి ఎన్నికలో కర్రు కాల్చి వాత పెట్టారు. బాబు మారిన మనిషిని అంటేనే 2014లో అధికారం అప్పగించారు. తాము ఏ మాత్రం మారలేదని ఆయనతో పాటు తమ్ముళ్ళు కూడా రుజువు చేసుకున్నారు. దాంతో కొత్త పార్టీగా భావించి జగన్ కి చాన్స్ ఇచ్చారు. జగన్ పాలన ఇంకా ఇపుడిపుడే మొదలవుతోంది. ఏపీలో జగన్ కి పోటీగా నాయకుడు అంటే ఎవరూ లేరని చెప్పాలి, చంద్రబాబు ది అవుట్ డేటెడ్ పాలిటిక్స్. ఇక జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.


మరో వైపు ఏపీలో ఎదగాలని బీజేపీ చూస్తున్నా ఆ పార్టీకి బేస్ లేకపోవడం అతి పెద్ద మైనస్, ఏపీలో ముస్లిం మైనారిటీలు తక్కువ. తెలంగాణా మాదిరిగా ఇక్కడ అధిక సంఖ్యలో లేకపోవడం వల్ల బీజేపీ హిందూ కార్డ్ చెల్లడంలేదు. ఇక మఠాలూ, గోపురాలు వంటివి ఉన్నా బీజేపీ రాజకీయం బాగా పండేది కానీ అవి కూడా పెద్దగా లేవు, జనాలకు కూడా  మతాలపైన అంత ఆసక్తి లేదు. దాంతో బీజేపీ ఎంత గింజుకున్నా రెండంకెల సీట్లు సాధించడం కష్టం.
 


వచ్చే ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి ఉంటే తక్కువ సీట్లు వచ్చినా మళ్ళీ జగనే సీఎం అవుతారు. ఎందుకంటే అయన్ని ఢీ కొట్టే కొత్త రాజకీయం లేకపోవడం వల్లనే. సరిగ్గా ఇదే పాయింట్ మీద ఇపుడు ఓ చర్చ నడుస్తోందట. ఏపీలో ఉన్న రాజకీయ శూన్యతను సొమ్ము చేసుకోవాలంటే జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాలని. ఆయన తన తాత స్థాపించిన టీడీపీలో చేరుతారని అంటూంటే మరికొందరు ఆయనకు అంత అవకాశం బాబు ఇవ్వరని చెబుతున్నారు.


ఇక జూనియర్ కూడా తన సత్తా చాటుకుంటూ సొంతగానే రావాలని చూస్తున్నారుట. ఆయన కొత్త పార్టీ పెట్టి తాత మాదిరిగానే జనంలో నుంచే అధికారం అందుకోవాలని చూస్తున్నారుట. జూనియర్ కొత్త పార్టీ పెడతారని, దానికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని వేణు స్వామి అనే జ్యోతిష్కుడు జోస్యం చెబుతున్నారు. ఆయన కనుక పార్టీ పెడితే అధికారంలోకి రావడం కూడా జరుగుతుందని ఆయన జాతకం చూసి మరీ చెబుతున్నారు.


జూనియర్ 2023 నాటికి కొత్త పార్టీ పెట్టి జనంలోకి వస్తారని వేణుస్వామి గట్టిగా చెబుతున్నారు. జూనియర్ జాతకంలో రాజకీయాల్లోకి వస్తారని, ఉన్నత పదవులు చేపడతారని ఉందని కూడా అంటున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్ కూదా ఇచ్చారు ఈ వేణు స్వామి. ఇపుడున్న అంచనాల ప్రకారమే తాను చెబుతున్నానని, జూనియర్ ఒకవేళ పార్టీ పెట్టినా అప్పటి ప‌రిస్థితులు వేరేలా ఉంటే చెప్పలేమని కూడా అంటున్నారు. మొత్తానికి జూనియర్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని మాత్రం హింట్ ఇస్తున్నారు. మరి జూనియర్ సినిమాలు ఇపుడు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఆయన  పాలిటిక్స్ లోకి వస్తారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: