భారీగా కురిసిన వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇన్ ఫ్లో కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వరద గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేతతో గోదావరిలో ప్రవాహం పెరిగింది. వర్షాలు, వరదలతో ఉమ్మడి ఆదిలాబాద్ లోని ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లా మారాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు వరప్రదాయిని లాంటి కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం ఉంది. 700 అడుగులకు గాను 696 అడుగుల మేర నీరు చేరింది.



కడెం ప్రాజెక్టు నీటి ఉధృతి ఇన్ ఫ్లో పెరుగుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు గేట్లను ఎత్తివేసి నిద్ర పోతున్న కడెం ప్రాజెక్టు నీటితో గోదావరి దిగువన ఉన్న ఎల్లంపెల్లి ప్రాజెక్ట్ లోకి భారీగా ఇన్ ఫ్లో వస్తుంది. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి పది గేట్లను ఎత్తివేసి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం పంతొమ్మిదిన్నర టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.



ఎల్లంపల్లి ప్రాజెక్టు గేటులెత్తిన నేపథ్యంలో గోదావరి దిగువన ఉన్న సుందిళ్ల బ్యారేజీకి సంబంధించిన నాలుగు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. అదే సమయంలో సుందిళ్ల దిగువున ఉన్న అన్నారం బ్యారేజిలో కూడా గేట్లను ఎత్తి వేశారు.మొత్తం మీద నిన్నా మొన్నటి దాకా కళ లేని గోదావరి ప్రస్తుతం కడెం, ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేతతో గోదావరి నది కూడా పూర్తి స్థాయిలో ప్రవాహం పెరిగింది. అదే సమయంలో అన్నారం బ్యారేజి గేట్లను కూడా నిన్నటి నుంచి ఎత్తేశారు.



అన్నారం బ్యారేజి ఎత్తివేతతో మేడిగడ్డ వరకు కడెం నుంచి మేడిగడ్డ వరకు పూర్తి స్థాయిలో గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. మొన్నటితో పోల్చుకున్నట్లు అయితే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గత పది రోజుల క్రితం వరకూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నాలుగు టీఎంసీల మేర నీరు ఉండే డేస్టోరేజ్ లో ఉంది. వారం రోజుల నుంచి ఒక్కసారిగా వర్షం కురవటంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో జలకళ వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: