ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాల కొరత కారణంగా మొన్నటివరకూ శాంతించిన గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుంది . ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర గోదారిలా మారుతుంది . వందలాది లంకగ్రామాలు వరద గుప్పెట్లో చిక్కుకోగా పోలవరం దగ్గర గోదావరి ఉధృతిని చూసి ముంపు గ్రామాల ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు .



అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి . దీంతో ఉభయ  గోదారి జిల్లాల్లోని విలీన మండలాల్లో జన జీవనం స్తంభించింది . వి ఆర్ పురం , చింతూరు మండలాల మధ్యలో దాదాపు ముప్పై గ్రామాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి .  అనేక లంక గ్రామాలకు నిత్యావసరాలు అందడం లేదు .



అయితే రాబోయే వరదను దృష్టిలో ఉంచుకొని శ్రీరామగిరి , చింతరేవుల పల్లి గ్రామాల దగ్గర ఎస్. డీ. ఆర్. ఎఫ్ బృందాలు మోహరించాయి . ఇదిలా ఉంటే పోలవరం గ్రామాల్లోకి వరద రాకుండా రక్షణగా రెండు కిలోమీటర్ల మేర రింగ్ బండ్ కోతకు గురౌతోంది . తూర్పు గోదారి జిల్లా సఖినేటి పల్లి ,  పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మధ్య రాకపోకలు నిలిపివేశారు . పోలవరానికి వరద ఉధృతి కొనసాగుతుంది .



దీంతో పాత పోలవరం ముంపు గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు . వరద నీరు రాకుండా గత ప్రభుత్వ హయాంలో ఐదు కిలోమీటర్ల మేర భారీ ఏటిగట్టు నిర్మించారు . అయితే రాయితో రివిట్మెంట్ చేయకపోవడంతో ఆ కట్టా కొట్టుకుపోతుంది . దీంతో ఏ సమయంలో వరద తమ గ్రామాన్ని ముంచెత్తుతుందోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: