మోడీ అధ్యక్షతన బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక తరువాత తమ టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పార్లమెంట్ లో బల్ల గుద్ది చెప్పారు. కాశ్మీర్ కు విశేష అధికారాలను కేంద్రం తొలిగించడంతో ఇప్పుడు కాశ్మీర్ మీద కేంద్రం పూర్తిగా పెత్తనం చెలాయించవచ్చు. ఇందులో ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే నాటకాలకు తెర  పడిందని చెప్పాలి. ఇప్పుడు కాశ్మీర్ అన్ని కేంద్ర ప్రాంతాల మాదిరి అది కూడా ఒకటి. భారత దేశంలో అమలయ్యే అన్ని చట్టాలు అక్కడ అమలవుతాయి. దీనితో కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నిలువరించే అవకాశం భారత్ కు చిక్కింది. ఇన్ని రోజులు పాకిస్థాన్ ఆడిన నాటకాలు ఇక చెల్లవని మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ ను హెచ్చరించినట్టయింది.


అయితే ఇప్పటికే పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడుతూ పీఓకే కోసం తన ప్రాణమైనా అడ్డు పెడతానని,పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగమే అని అందులో ఎటువంటి సందేహం లేదని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. మోడీయే కాదు ఇదే విషయం మీద పలువురు బీజేపీ నేతలు ఇటువంటి నిర్ణయాన్నే చెప్పారు. బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ .. పాకిస్థాన్ మర్యాదగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను అప్పగించాలని, దానికి అమెరికా ప్రెసిడెంట్ పాకిస్థాన్ కు చెప్పాలని చెప్పిన సంగతీ తెలిసిందే. 


పీఓకే ను ఎట్టి పరిస్థితిలో సాధిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే  పీఓకే ను సాధించడానికి బీజేపీ దగ్గర ఏం ప్లాన్ ఉంది. పీఓకే ను సాధించడం అంత తేలికైన విషయం కాదు. అది ఇంటర్నేషనల్ వ్యవహారం. మరీ మోడీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అనేది ఇప్పటికి ఇంకా తెలియదు. కాశ్మీర్ అంటే 70 ఏళ్లుగా మన అధీనంలో ఉంది కాబట్టి కేంద్ర పరిధిలోకి తెచ్చుకోగలిగారు. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను దక్కించుకోవటం అంటే పూర్తి స్థాయి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరీ పూర్తి స్థాయి యుద్ధం వస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: