ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కి  సీఎం కావడం  తన చిరకాల కల అని రాజకీయాల్లోకి రాకముందే  స్వయంగా ప్రకటించుకున్న గడుసరి జగన్. మొత్తానికి  ఆ కల సాకారానికి ఎన్నో కష్టనష్టాలు..  మరోన్నో అవమానాలు ఆరోపణలను ఎదురుకుని  అనుకున్నది సాధించాడు. అయినా అనుకున్నది సాధించాలి అంటే.. అందరి వల్ల అవుతుందా ? పైగా ఒక రాష్ట్రానికి సీఎం అవ్వడం అంటే అదృష్టం కూడా తోడు అవ్వాలి. అయితే జగన్ కి అదృష్టం ఉందో లేదో తెలియదు గాని స్పష్టమైన ప్రణాళికలు అయితే  ఉన్నాయి. కానీ  ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. జగన్ ప్రణాళికలు పారేలా కనిపించడంలేదు. జగన్ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది. ముఖ్యమంత్రి కూర్చీతోనే  బోలెడన్ని బరువు బాధ్యతలు నెత్తిన వేసుకున్న జగన్, ఇప్పుడు ఆ బాధ్యతలే  అధిక భారం  అయి జగన్ని ముంచేలా కనిపిస్తున్నాయేమో అని అనుమాన పడాల్సిన స్థితి వస్తోంది.  ఎందుకంటే  జగన్ ఇచ్చిన హామీలు అనేకానేకం. ఆ హామీలు అమలు పరచాలంటే బడ్జెట్ సరిపోదు. మరోపక్క కేంద్రం నుంచి రావాల్సిన హోదా మరియు ఇతర అంశాలు ఏమాత్రం ముందుకు వెళ్లేలా కనిపించట్లేదు. ఈ రోజు కేంద్ర నాయకులతో కలిసాక కూడా ఇదే పరిస్థితి. 


 కారణం బీజేపీ ప్రస్తుత టార్గెట్ జగనే. క్లుప్తంగా చెప్పుకుంటే బీజేపీ నుండి జగన్ కి  సాయం అందదు. జగన్ ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే.. బడ్జెట్ అమాంతం పెరగాలి. అది సాధ్యమయ్యే పనికాదు. ఈ పరినిమాలన్ని గమనిస్తే..    ఏపీ సీఎంగా  జగన్ తీవ్రమైన ఒత్తిడిలోకి  వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ ఇచ్చిన ప్రతి హామీలో  ప్రతీ అంశంలో  విఫలం అవుతున్నారని ఇతర పార్టీల శ్రేణులు...  ముఖ్యంగా బాబు మరియు ఆయన పుత్రరత్నం చిన్నబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.  రాష్ట్రానికి హోదా రాకపోతే  ఇతర పార్టీల వారితో పాటు ప్రజలు కూడా జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి.   అన్నిటికి మించి  రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ముందు పెను సవాళ్లు  ఉన్నాయి.  ఆ సవాళ్ళను ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్నగా మెదులుతుంది. మరి జగన్ ఏం చేస్తాడో ?  


మరింత సమాచారం తెలుసుకోండి: