ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ (ఇండియ‌న్ ఆయిల్‌) బోర్డు లో డైరెక్ట‌ర్ (ఫైనాన్స్‌)గా సందీప్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం గుప్తా ప ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సందీప్ కుమార్ గతంలో  ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేట్ కార్యాల‌యంలో కార్య‌నిర్వాహ‌క సంచాల‌కుడు (ఇడి - కార్పొరేట్ ఫైనాన్స్‌)గా వ్యవహరించారు. అంతేకాకుండా  ఆయ‌న చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ గాను, కార్పొరేట్ అకౌంట్స్, ట్రెజ‌రీ, ఇన్‌వెస్ట్ మెంట్ అప్రైజ‌ల్ మ‌రియు రిస్క్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌హారాలకు సంబంధించిన చీఫ్ రిస్క్ ఆఫీస‌ర్ ఇన్‌ఛార్జ్ గాను విధులను విజయవంతం గా నిర్వ‌హించిన అనుభవం ఉంది.ఆయా రంగాల్లో సందీప్ గడించిన అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కీలకమైన బాధ్యత లను అప్పగించింది.
 


సందీప్ కుమార్  గుప్తా వాణిజ్య శాస్త్రంలో ప‌ట్ట‌భ‌ద్రుడు, చార్ట‌ర్డ్ అకౌంటెంట్. ఇండియ‌న్ ఆయిల్ రంగంలో ఆయ‌నకు 31 సంవ‌త్స‌రాల‌కు పైగా విశేష అనుభవం ఉంది.  భారతదేశంలో ఉత్త‌ర, ప‌శ్చిమ, ఇంకా ఈశాన్య ప్రాంతాలలో గల ఇండియ‌న్ ఆయిల్ రిఫైన‌రీ యూనిట్ లలో పని చేశారు. ముఖ్యంగా ఆర్థిక విధులను, అకౌంటింగ్ తదితర విభాగాల విధుల‌ను సమర్థవంతంగా నిర్వ‌హించ‌డంలో రెండు ద‌శాబ్దాలకు మించిన అనుభ‌వం శ్రీ గుప్తాకు ఉంది. అంతే కాకుండా కార్పొరేట్ అకౌంట్స్, ట్రెజ‌రీ, ఇన్‌వెస్ట్ మెంట్ అప్రైజ‌ల్ మ‌రియు రిస్క్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌హారాలకు సంబంధించిన చీఫ్ రిస్క్ ఆఫీస‌ర్ ఇన్‌ఛార్జ్ గా ప‌ని చేశారు



ఇండియ‌న్ ఆయిల్ పూర్తి యాజ‌మాన్యంలో నిర్వహించబడుతున్న  విదేశీ అనుబంధ సంస్థ అయిన ఐఒసి మిడిల్ ఈస్ట్ ఎఫ్‌జ‌డ్ఇ బోర్డులో కీలకమైన బాధ్యతలను నిర్వహించిన అనుభవం ఉంది. అంతే కాకుండా దేశీయ జాయింట్ వెంచ‌ర్ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ పెట్రోనాస్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులో కూడా సందీప్ కుమార్ గుప్తా ప‌ని చేశారు. ఈ క్రమంలో సందీప్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డైరెక్టర్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: