టీడీపీకి ఎన్ని రకాల మేకప్పులు కలరింగులు ఇచ్చినా కూడా తమ్ముళ్ళు నమ్మడం మానేశారు. ఎందుకంటే నరేంద్రమోడీ కేంద్రంలో బలంగా ఉన్నారు. ఏపీలో జగన్ బంపర్ విక్టరీతో గట్టిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అయిదేళ్ళు కాదు మరో టెర్మ్ కూడా వేచి చూసినా అధికారం దక్కుతుందా అన్న డౌట్లో తమ్ముళ్ళు పడిపోయారు. దాంతో పక్క చూపులు ఎక్కువైపోయాయి. ఏపీలో తమ్ముళ్ళకు అన్ని పార్టీలూ గేలం వేస్తున్నాయి. దాంతో తమకు అనువైన చోటకు  చేరిపోవాలను అనుకుంటున్నారుట.


ఎమ్మెల్యేలను తీసుకోవాలంటే పదవికి రాజీనామా చేయాలని నిబంధన పెట్టిన జగన్ పార్టీ నాయకుల విషయంలో ఏ రకమైన షరతులూ పెట్టలేదు. దాంతో గోడ దూకడానికి రెడీగా తమ్ముళ్ళు ఉన్నారు. చాన్స్ దొరికిందే చాలు అని అంటున్నారు. విశాఖలో నగరానికి చెందిన ఓ బడా నాయకుడు వైసీపీలో అతి తొందరలో చేరిపోతాడని టాక్ నడుస్తోంది. ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా కీలకమైన నామినేటెడ్  పదవులు కూడా గతంలో నిర్వహించారు. టీడీపీలో ఉంటే ఇక ఒరిగేది ఏమీ ఉండదన్న ఆలోచనతోనే ఆయన జంప్ అంటున్నారట.


ఇక ఇదే విశాఖ జిల్లాలో ఓ టీడీపీ సీనియర్ రాజకీయ నాయకుని కుమారుడు వైసీపీలో చేరేందుకు సిధ్ధపడుతున్నట్లుగా చెబుతున్నారు. డీల్  కనుక కుదిరితే ఆయన తొందరలోనే సైకిల్ దిగిపోతారని అంటున్నారు. ఆయన కనుక వైసీపీలోకి వస్తే రూరల్లో మంచి పట్టు దొరుకుతుందని, కొన్ని అసెంబ్లీ సీట్లలో లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయవచ్చునని వైసీపీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు.


ఇక విశాఖతో పాటు ఏజెన్సీలోనూ ఇతర పార్టీల నేతలకు వైసీపీ గేలం వేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల నాటికి ప్రత్యర్ధి పార్టీని ఖళీ చేయించాలనుకుంటోంది. అదే కనుక జరిగితే సైకిల్ పార్టీకి ఇబ్బందులు తప్పవని  అంటున్నారు. దీని మీద ఇటీవల విశాఖ వచ్చిన వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి  గేట్లు తెరుస్తామని, ఎవరైనా పార్టీలోకి రావచ్చునని ఓపెన్ ఆఫర్ ని ప్రకటించేశారు. పార్టీ కోసం ఎవరు వచ్చినా తప్పనిసరిగా ఆదరించాలని కార్యకర్తలను కూడా ఆయన కోరడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: